ఇంగ్లాండ్ సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా నెట్స్‌లో శ్రమిస్తోంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆటగాళ్లలో నూతనోత్సాహం నింపేందుకు భారత జట్టు ఓ ఫన్నీ గేమ్ ఆడింది. జాలీగా సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్ ఎంతో సరదాగా సాగింది.
ఇంతకీ ఆట ఏంటంటే?
ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా రోహిత్ శర్మ.. టీమ్ఇండియా ఆటగాళ్లకు ఓ వినూత్న ఆటను పరిచయం చేశాడు. ఈ గేమ్‌లో జట్టు రెండు బృందాలుగా విడిపోయింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ రాకెట్‌తో టెన్నిస్ బంతిని గాల్లోకి కొట్టగా.. ఓ టీమ్‌కు సంబంధించిన క్రికెటర్ మైదానం మధ్యలో నిలబడి ఆ బాల్‌ను బ్యాట్‌తో కాకుండా తలతో(హెల్మెట్ పెట్టుకుని) తిరిగి గాల్లోకి కొట్టాలి. రెండో జట్టులోని ఆటగాళ్లు ఆ బంతిని క్యాచ్ పట్టాలి. అలా నిర్ణీత సమయంలో ఎన్ని క్యాచ్‌లు పట్టుకుంటే అన్ని పాయింట్లు సదరు జట్టుకు లభిస్తాయి. అలా ఇరు జట్టు ఆడతారు. మొత్తంగా ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ క్యాచ్‌లు పట్టుకుంటే వారు విజేతగా నిలుస్తారు.
మొదట వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌తో ఈ ఆట ప్రారంభమైంది. అలా ఈ ఆట ఆడే క్రమంలో మజా వస్తుండటం వల్ల మిగతా ఆటగాళ్లు కూడా బంతిని హెల్మెట్‌కు తాకించుకుంటూ, క్యాచ్‌లు పట్టుకుంటూ సరదాగా ఆడారు. మొత్తంగా జాలీగా, హాస్యభరితంగా సాగిన ఈ సెషన్ వల్ల మైదానమంతా నవ్వులే నవ్వులు. ఆగస్టు 4 నుంచి టీమ్ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
-
Fun 😎
— BCCI (@BCCI) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Practice 👌
Laughter 😀
DO NOT MISS as @ImRo45's unique game leaves #TeamIndia in splits 😆 - by @RajalArora
Watch the full video 🎥 ⬇️ #ENGvIND https://t.co/2wvMB2m2Q8 pic.twitter.com/BqHMZ9uvfg
">Fun 😎
— BCCI (@BCCI) August 2, 2021
Practice 👌
Laughter 😀
DO NOT MISS as @ImRo45's unique game leaves #TeamIndia in splits 😆 - by @RajalArora
Watch the full video 🎥 ⬇️ #ENGvIND https://t.co/2wvMB2m2Q8 pic.twitter.com/BqHMZ9uvfgFun 😎
— BCCI (@BCCI) August 2, 2021
Practice 👌
Laughter 😀
DO NOT MISS as @ImRo45's unique game leaves #TeamIndia in splits 😆 - by @RajalArora
Watch the full video 🎥 ⬇️ #ENGvIND https://t.co/2wvMB2m2Q8 pic.twitter.com/BqHMZ9uvfg
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌లో కోహ్లీ అండ్ బాయ్స్.. జాలీ జాలీగా!