Rohit sharma Virat Kohli : పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్లో మిడిలార్డర్లో ఆడినంత కాలం సాధారణ బ్యాటర్‌గానే కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా రంగంలోకి దిగాక ఎలా చెలరేగిపోయాడో, ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో అందరికీ తెలిసిందే. వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ సాధించడమే గొప్ప విషయం అంటే రోహిత్.. మూడుసార్లు ఆ ఘనతను అందుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతే కాకుండా.. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు రికార్డు కూడా అతడిదే కావడం విశేషం. సుమారు దశాబ్ద కాలం నుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడిగా రోహిత్ కొనసాగుతున్నాడు.
Rohit Sharma Team India : ఇక ధోని తర్వాత కోహ్లినే వన్డే కెప్టెన్‌గా ఈ ప్రపంచకప్‌లో జట్టును నడిపిస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో.. అనూహ్య పరిణామాల మధ్య రోహిత్ చేతికి పగ్గాలు వచ్చాయి. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో గొప్ప పనితనం చూపించిన రోహిత్.. అదే నైపుణ్యాన్ని ప్రపంచకప్‌లో చూపించి ట్రోఫీ అందిస్తాడని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్య బ్యాటింగ్‌లో రోహిత్ ఫామ్ కొంత ఆందోళన కలిగించినప్పటికీ.. ప్రపంచకప్ ముంగిట అతను తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌లో చక్కటి ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో శుభ్‌మన్ తోడుగా జట్టుకు అతనెలాంటి ఆరంభాలందిస్తాడన్నది కీలకంగా మారింది. ఆరంభంలో తనదైన శైలిలో చెలరేగితే ఇక విజయానికి సగం పునాది పడిపోయినట్లే. గత ప్రపంచకప్‌లో రోహిత్ ఏకంగా నాలుగు శతకాలు బాదాడు. అదే ప్రదర్శనను సొంతగడ్డపైనా కూడా రోహిత్ పునరావృతం చేయాలని జట్టు ఆశిస్తోంది. 36 ఏళ్ల రోహిత్ ఈ ప్రపంచకప్‌తోనే వన్డేలకు గుడ్‌బై చెప్పే సూచనలున్నాయి. ఈ టోర్నీలో జట్టును అతను గెలిపించాడంటే తక్కువ వ్యవధిలోనే నాయకుడిగా అతను గొప్ప పేరు సంపాదించి ఘనంగా కెరీర్‌ను ముగిస్తాడు.
-
Player in 2015 ➡️ Leading run-scorer in 2019 ➡️ Captain in 2023 🙌
— BCCI (@BCCI) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️
Skipper Rohit Sharma is geared up for #CWC23 😎#TeamIndia | @ImRo45 pic.twitter.com/FX5CPykLLF
">Player in 2015 ➡️ Leading run-scorer in 2019 ➡️ Captain in 2023 🙌
— BCCI (@BCCI) September 29, 2023
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️
Skipper Rohit Sharma is geared up for #CWC23 😎#TeamIndia | @ImRo45 pic.twitter.com/FX5CPykLLFPlayer in 2015 ➡️ Leading run-scorer in 2019 ➡️ Captain in 2023 🙌
— BCCI (@BCCI) September 29, 2023
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️
Skipper Rohit Sharma is geared up for #CWC23 😎#TeamIndia | @ImRo45 pic.twitter.com/FX5CPykLLF
Virat Kohli Team India : ఓ బ్యాటర్‌గా విరాట్ కోహ్లి నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వన్డే క్రికెట్లో సచిన్‌ను మించిన పరుగుల ప్రవాహంతో, శతకాల మోతతో అతను అందరినీ అబ్బురపరిచాడు. కెరీర్ ఆరంభంలోనే ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాన్ని కూడా అందుకున్నాడు. ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతను సభ్యుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విజయంలో అతడి పాత్ర తక్కువే అయినప్పటికీ.. తన స్కిల్స్‌తో తర్వాతి టోర్నీ సమయానికి ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా ఎదిగాడు.
రానున్న ప్రపంచకప్‌లో విరాట్ తన అద్భుత ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలబెడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ గత రెండు టోర్నీల్లోనూ ఆ ఆశ నెరవేరలేదు. చాలా ఏళ్ల పాటు టెస్టుల్లో.. కొన్నేళ్ల పాటు వన్డేలు, టీ20ల్లో కూడా కెప్టెన్‌గా జట్టును నడిపించిన కోహ్లి.. జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఆ మధ్యలో ఫామ్ లేమికి తోడు కెప్టెన్సీ కోల్పోవడం కూడా విరాట్ కెరీర్‌నే దెబ్బ తీసేలా కనిపించాయి. కానీ గత ఏడాది వ్యవధిలోనే అతను బాగానే పుంజుకున్నాడు. ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలే జరిగిన ఆసియా కప్‌లో పాక్‌పై అద్భుత శతకం బాదాడు.
ఈ ప్రపంచకప్ పూర్తయ్యే సమయానికి విరాట్‌కు 35 ఏళ్లు నిండుతాయి. ఇంకో ప్రపంచకప్ వరకు అతను కొనసాగడం సందేహమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ టోర్నీలోనే అతను అద్భుతంగా రాణించి 50వ శతకంతో సచిన్‌ను మించే అవకాశాలున్నాయి. దీంతో పాటు అంచనాలకు తగ్గ ఆటతో జట్టు ప్రపంచకప్ గెలవడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తే.. వన్డేల్లో అత్యంత గొప్ప ఆటగాడిగా కెరీర్‌ను ముగించడానికి అవకాశముంటుంది.
ఈ ఏడాది విరాట్ ఫామ్ గొప్పగా ఉంది. రోహిత్ కూడా ఇటీవలే లయ అందుకున్నాడు. ఈ జోడీ ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలన్నది అభిమానుల ఆశ. జట్టును సమష్టిగా నడిపించడంలోనూ సమన్వయంతో సాగితే కప్పు గెలవడం కష్టమేమీ కాదు.
-
Batch of 2011 ➡️ Batch of 2023
— BCCI (@BCCI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli 🤝 R Ashwin
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️#TeamIndia | #CWC23 pic.twitter.com/AfUJeL0nas
">Batch of 2011 ➡️ Batch of 2023
— BCCI (@BCCI) October 1, 2023
Virat Kohli 🤝 R Ashwin
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️#TeamIndia | #CWC23 pic.twitter.com/AfUJeL0nasBatch of 2011 ➡️ Batch of 2023
— BCCI (@BCCI) October 1, 2023
Virat Kohli 🤝 R Ashwin
𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗖𝘂𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 🏟️#TeamIndia | #CWC23 pic.twitter.com/AfUJeL0nas
World Cup 2023 Ambassador : ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్.. ఫుల్ ఖుషిలో తెందూల్కర్ ఫ్యాన్స్