Rohit Sharma Records List : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే వేదికపై ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. మ్యాచ్ 21 ఓవర్‌లో ఓ ఫోర్‌తో ఈ రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతే కాకుండా ఇదే వేదికగా హిట్‌మ్యాన్ మరో ఘనతను కూడా సాధించాడు. టీమ్ఇండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. అలా ఈ అరుదైన మార్క్‌ను అందుకున్న ఏడో ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ కంటే ముందు ఈ లిస్ట్‌లో ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌లు ఉన్నారు.
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 99 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 51 టీ20, 39 వన్డే, 9 టెస్టు మ్యాచ్‌లకు గానూ రోహిత్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2017లో కెప్టెన్‌గా పగ్గాలు అంగదుకున్న హిట్‌మ్యాన్.. తన నాయకత్వంలో ఏకంగా 73 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలో టీమ్ఇండియా రెండు సార్లు ఆసియా కప్ కూడా గెలిచింది.
సెంచరీ మిస్..
Rohit Sharma World Cup 2023 : ఓపెనర్‌గా మ్యాచ్‌లోకి దిగిన రోహిత్ శర్మ (87).. దూకుడుగా ఆడాడు. వికెట్లు పడిపోయు కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను ఒంటిచేత్తో లాకొచ్చాడు. ఓపెనర్‌గా రంగంలో దిగినప్పటి నుంచి బాల్‌ను బౌండరీలు దాటిస్తూ వచ్చాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. అయితే 37 ఓవర్‌లో ఆదిల్ రషీద్ వేసిన బాల్‌కు భారీ షాట్ ఆడి లివింగ్‌స్టోన్ చేతికి చిక్కాడు. సెంచరీ చేస్తాడని అనుకుంటున్న సమయంలో 13 పరుగుల తేడాలో సెంచరీ మిస్ చేసుకుని అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు.
మరోవైపు ఇదే మ్యాచ్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి సూపర్ ఇన్నింగ్స్‌ను ఆడారు. నాలుగో వికెట్ సమయానికి 91 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు సాధించిన కెఎల్ రాహుల్.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
A special TON! 💯
— BCCI (@BCCI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to #TeamIndia skipper Rohit Sharma who is all set to play his 1⃣0⃣0⃣th international match as a Captain 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/WqX3rDuddk
">A special TON! 💯
— BCCI (@BCCI) October 29, 2023
Congratulations to #TeamIndia skipper Rohit Sharma who is all set to play his 1⃣0⃣0⃣th international match as a Captain 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/WqX3rDuddkA special TON! 💯
— BCCI (@BCCI) October 29, 2023
Congratulations to #TeamIndia skipper Rohit Sharma who is all set to play his 1⃣0⃣0⃣th international match as a Captain 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/WqX3rDuddk
Rohit Sharma ODI Record : మెగాటోర్నీలో రోహిత్ పరుగుల మోత.. బద్దలైన ఆసీస్ దిగ్గజం రికార్డ్