Rohit Sharma Practice Photo : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో చెమటోడ్చాడు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్.. ఆసియా వన్డే కప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో చివరిగా రోహిత్ వన్డే మ్యాచ్ ఆడాడు. విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్ భారత్‌కు 1-0తో ట్రోఫీని అందించాడు.
![Rohit Sharma Practice Photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/19307374_rohit_-sharma_-practice_-photo.jpg)
కెప్టెన్సీతో అదరగొట్టిన రోహిత్..
Rohit Sharma West Indies Tour : ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు రోహిత్. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌తో పాటు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి కూడా మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
హిట్‌మ్యాన్ ఫిక్స్ వైరల్..
విండీస్ టూర్ తర్వాత కెప్టెన్ రోహిత్, కోహ్లీ భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ ప్రాక్టీస్ కోసం కేటాయించాడు. మైదానంలో కసరత్తులు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్, షార్ట్, జాగింగ్ షూ వేసుకుని రోహిత్ స్టైలిష్‌గా కనిపించాడు.
India Ireland Tour 2023 Squad : ఇక ఆసియా కప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆగస్టు 23న రోహిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయనున్నారని తెలుస్తోంది. వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో అదరగొట్టింది. ఆగస్టు 18న జరిగిన మొదటి టీ20లో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Asia Cup 2023 : బీసీసీఐ మీటింగ్‌కు రోహిత్.. జట్టులో రాహుల్, బుమ్రాకు చోటు దక్కేనా?
మిడిలార్డర్‌లోకి రోహిత్? మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్టేనా? మరి ఓపెనింగ్ ఆ ఇద్దరేనా?