ETV Bharat / sports

గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్​.. రూ.6.5లక్షలు జరిమానా! - మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో కెప్టెన్​ రోహిత్ శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడికి భారీ స్థాయిలో జరిమానా విధించినట్లు తెలిసింది.

Rohit Sharma Fan Fined 6 Lakhs
గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్​.. రూ.6.5లక్షలు జరిమానా
author img

By

Published : Nov 7, 2022, 1:06 PM IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్​ఇండియా సూపర్-12 గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది. సెమీస్​కు అర్హత సాధించింది. ఈ సెమీఫైనల్​లో భాగంగా 10వ తేదీన ఇంగ్లాండ్​తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మైదానంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన హీరో రోహిత్ శర్మను కలవాలని ఆశపడ్డాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.

గమనించిన అధికారులు అతడి వెనక పరుగులు తీసి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, అతడు రోహిత్‌ను కలవకముందే సిబ్బంది పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయితే ఈ సాహసం చేసినందుకు ఆ కుర్రాడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రౌండ్ యాజమాన్యం ఆ కుర్రాడికి భారీ జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం.. ఆ కుర్ర అభిమానికి అక్షరాలా రూ. 6.5 లక్షల జరిమానా విధించినట్లు తెలిసింది. అభిమానులు తమ ఆరాధ్యదైవంగా భావించే క్రికెటర్లను కలుసుకోవడానికి ఇలాంటి సాహసాలు చేయడం కొత్తేం కాదు. కానీ జరిమానా విధించడం మాత్రం కొత్తే!

ఇదీ చూడండి: ఆ సమయంలో ధోనీ పంపిన మెసేజ్​ మనసును తాకింది: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.