Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురింపించాడు. తనకు అశ్విన్ 'ఆల్‌టైమ్ గ్రేట్' అని కొనియాడాడు. భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్న కపిల్ దేవ్‌ను అశ్విన్ వెనక్కినెట్టాడు. అశ్విన్ 85 టెస్టుల్లోనే 436 వికెట్లు తీశాడు.
"ఇలాంటి రికార్డు సాధించడం గొప్ప విషయం. చాలా ఏళ్లుగా అశ్విన్‌ను గమనిస్తున్నా ప్రతీసారి అతను ఇంకా మెరుగవుతూనే ఉన్నాడు. తనతో పాటు జట్టుకు కూడా రికార్డులు అందించే సామర్థ్యం అతడిలో ఉంది. చాలా ఏళ్లుగా జట్టు కోసం ఆడుతున్నాడు. అనేక విజయాల్ని అందించాడు." -రోహిత్ శర్మ, భారత కెప్టెన్
కోహ్లీ ప్రత్యేకమైమన వందో టెస్ట్‌ను గెలవాలనుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.
" ఇది మంచి ప్రారంభం. మా దృష్టిలో ఈ మ్యాచ్ చాలా గొప్పది. ముందుగా అనుకున్నట్టుగానే మేం అన్ని విభాగాల్లో రాణించాం. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగుస్తుందని నేను అనుకోలేదు. మా బౌలర్లు సమష్టిగా మంచి బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచారు. మ్యాచ్‌లో జడేజా హైలైట్‌గా నిలిచాడు. డిక్లేర్ చేయాలా వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు జడేజా నిస్వార్థంగా డిక్లేర్ చేద్దామని చెప్పాడు."
-రోహిత్ శర్మ, భారత కెప్టెన్
మ్యాచ్ ఇంత త్వరగా ముగుస్తుందని అనుకోలేదన్నాడు శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.
" ఈ టెస్టు మూడో రోజుతో ముగుస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు. మా బ్యాటర్లు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. మేం మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే భారత ఆటగాళ్లు పరుగులు చేయకుండా కట్టడి చేసేవాళ్లం"అని శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే తెలిపాడు.
రిషభ్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని భావించానని చెప్పాడు రవీంద్ర జడేజా. ఈ టెస్టులో జడ్డూ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
"ఇది నాకు లక్కీ గ్రౌండ్. ఇక్కడ నేను మ్యాచ్ ఆడినప్పుడల్లా మంచి ప్రదర్శన చేస్తున్నా. రిషభ్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని భావించా. జట్టు కోసం పరుగులు చేయడం, వికెట్లు తీయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒక ఆటగాడిగా నేను చేసిన ఈ ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది." అని రవీంద్ర జడేజా తెలిపాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 578/8 పరుగులకు డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (175*) దంచికొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 పరుగులకే కుప్పకూలడంతో ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ లంకేయులు 178 పరుగులకే చేతులెత్తేశారు.
ఇదీ చదవండి: Ipl 2022: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫస్ట్ మ్యాచ్ ఇదే..