ETV Bharat / sports

రోహిత్ శర్మ కెప్టెన్సీ సెంటిమెంట్​.. ఇప్పటికే 8 సార్లు.. ఈ సారి వర్కౌట్​ అయితే..

WTC Final 2023 IND VS AUS : డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 టైటిల్ మనదేనంటూ టీమ్​ఇండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం రోహిత్​ శర్మ 'ఫైనల్స్​ కెప్టెన్సీ'​ సెంటిమెంట్​. అర్థంకాలేదా? అయితే ఇది చదివేయండి..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 7, 2023, 1:31 PM IST

WTC Final 2023 IND VS AUS : టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(డబ్ల్యూటీసీ) ప్రారంభానికి ఇంకా కాసేపు మాత్రమే ఉంది. ఇప్పటివరకు ప్రాక్టీస్​ చేసిన ఇరు జట్లు.. ఇక శిక్షణను పక్కన పెట్టి.. ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలన్న విషయంపై మరిన్ని ఎత్తుగడలు రచిస్తున్నాయి. ఏ బ్యాటర్​కు ఎలా అడ్డుకట్టు వేయాలి? ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి అంటూ రెండు జట్లూ పథకాలు రచిస్తున్నాయి. అలాగే ఈ ఫైనల్​లో తమదే విజయమంటూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

Rohit Sharma as captain stats : అయితే ఇక్కడ ఓ విషయమేమిటంటే.. గత రికార్డులను పరిశీలిస్తే టీమ్​ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా మన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా అన్నీ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఒకటి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. కెప్టెన్‌గా తన జట్టును ఫైనల్​ వరకు తీసుకెళ్లాడంటే గెలిచి తీరాల్సిందే! అవును మీరు చదివింది నిజమే!

హిట్​మ్యాన్​ ఇప్పటివరకు సారథిగా.. తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను 8 సార్లు ఫైనల్స్​కు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన ఈ 8 సందర్భాల్లో రోహిత్​ సేననే విజయం సాధించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి ట్రాక్‌ రికార్డును తెచ్చిపెట్టింది. గతంలో రోహిత్​ 2018 ఆసియా కప్‌, 2018 నిదాహస్‌ టోర్నీలో భారత్​ జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ఐపీఎల్‌లో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయి ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. రోహిత్‌ సారథ్యంలో ముంబయి ఇండియన్స్‌ 2013 ఛాంపియన్స్‌ లీగ్‌ కూడా విజయాన్ని అందుకుంది. దీంతో రోహిత్‌ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం 8 ట్రోఫీలు చేరాయి. ఇప్పుడు దీని ఆధారంగానే.. భారత్​ అభిమానులు ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్​ గద టీమ్​ఇండియాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందని ఆశిస్తున్నారు. 'ఇక్కడి దాకా వచ్చాడంటే.. జట్టు గెలిస్తుంది అంతే' అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రోహిత్​ను 'ది బాస్'​ అంటూ అభివర్ణిస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టు జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్​లో రోహిత్​కు ఇదే తొలి ఐసీసీ టైటిల్​ అవుతుంది. రోహిత్ కూడా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఎలాగైనా గెలిచి తన ఖాతాలో మరో టైటిల్​ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Rohit sharma As captain won all finals he lead looking WTC 2023 final
రోహిత్ శర్మ కెప్టెన్సీ సెంటిమెంట్​

ఇదీ చూడండి :

WTC Final 2023 : సమరానికి సిద్ధం.. అసలు ముప్పు అదే.. గద దక్కేనా!

kohli vs Australia : ఆసీస్​పై సాధించిన కోహ్లీ రికార్డులివే.. మరి ఈసారి ఏం చేస్తాడో?

అతను సెంచరీ బాదితే టీమ్​ఇండియాదే విజయం.. ఇదిగో ప్రూఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.