India Australia T20 Series : మెగా టోర్నీ ముందు టీమ్ ఇండియా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. అయితే మైదానం తడిగా ఉండటం వల్ల రెండో మ్యాచ్‌ను 8 ఒవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్సనతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా. టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. 5 వికెట్లు తీసి 90 పరుగులు ఇచ్చింది. 91 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన.. రోహిత్ సేన.. మధ్యలో తడబడ్డా సునాయసంగా గెలిచింది.
ఈ విజయం పట్ల విమర్శకులు ఎలా ఉన్నా.. టీమ్ ఇండియా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సిరిలో ఆఖరి మ్యాచ్ జరగనుంది. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న భారత్-ఆస్ట్రేలియా.. డిసైడర్ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే శుక్రవారం జరిగిన చిట్టి మ్యాచ్ గురించి రోహిత్ శర్మ, ఫించ్ ఏమన్నారంటే..
రోహిత్ శర్మ తన బ్యాటింగ్ గురించి స్పందిస్తూ.. "నేనూ సర్ప్రైజ్ అయ్యాను. నేను అలా ఆడతానని నుకోలేదు.. కానీ బాగానే అడాను. గత 8-9 నెలల నుంచి నేను అలాగే ఆడుతున్నాను. అయితే ఇలాంటి చిన్న మ్యాచ్‌లో ఎక్కువ ప్లాన్ ఏమీ చేయలేము. అయితే ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చాలా బాగా వేశాం. హర్షల్ బౌలింగ్‌పై నేను కామెంట్ చేయదలచుకోలేదు. ఒక జట్టుగా మేము ఆ విషయాన్ని అంతగా విశ్లేషించము. అతడు మంచిగా ఆడలని కోరుకుంటాము. అతడు బ్యాటింగ్ కూడా చేయాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.
అయితే, అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన చేశాడని రోహిత్ కొనియాడాడు. "అతడు ఏ స్టేజ్లోనైనా అడగలడు. దీంతో నేను ఏ పరిస్థితుల్లో ఏ బౌలర్‌ను ఉపయోగించుకోవాలో సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత అతడు మిడిల్లో బ్యాటింగ్ చేశాడు. అయితే మొదటగా రిషబ్ పంత్‌ను పంపించాలనుకున్నాం. కానీ అప్పుడు సామ్ బౌలింగ్‌కు వచ్చాడు. దాంతో దినేశ్‌ను పంపించాం" అని రోహిత్ శర్మ వివరించాడు.
ఆ రెండు ఓవర్లు మ్యాచ్‌ను మర్చేశాయి..
మ్యాచ్‌పై అరోన్ ఫించ్ స్పందిస్తూ.." నిజానికి మనం 5 ఓవర్లకు ప్లాన్ చేస్తాం. కానీ ఇది అంతకంటే కొంచెం ఎక్కువ. రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ రెండు ఓవర్ల మ్యాచ్‌లో డిఫరెన్స్ తీసుకొచ్చాయి. వేడ్ కూడా మా తరఫున మంచి ఫినిష్ ఇచ్చాడు. జంపా కూడా మంచి బౌలింగ్ వేశాడు" అని తెలిపాడు.
బుమ్రా.. బ్యాక్..
గాయం కారణంగా మొదటి మ్యాచ్ ఆడకపోయినా.. రెండో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. పర్ఫెక్ట్ యార్కర్‌తో ఆరోన్ ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో జట్టు బౌలింగ్‌లో కొంచెం బలం పెరిగింది.
ఇవీ చదవండి: మాస్టర్ బ్లాస్టర్ మెరుపు సిక్స్.. అభిమానులు ఫిదా
ఇంకా తేలని టికెట్ల లెక్క.. స్టేడియం కుర్చీలపై పిట్టల రెట్ట.. మ్యాచ్ నిర్వహణ ఎలా?