Rohit Sharma 5th T20 Century: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 5 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ (121 పరుగులు, 69 బంతుల్లో: 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరంగం సృష్టించాడు. హిట్‌మ్యాన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం రోహిత్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. మరో ఎండ్‌లో హిట్టర్ రింకూ సింగ్ (69 పరుగులు, 39 బంతుల్లో 6 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 212-4 భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మలిక్ 3, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
-
🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏#RohitSharma𓃵 #Hitman #INDvAFG pic.twitter.com/cwUODsNN0p
— sports cricket (@cricket_new07) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏#RohitSharma𓃵 #Hitman #INDvAFG pic.twitter.com/cwUODsNN0p
— sports cricket (@cricket_new07) January 17, 2024🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏#RohitSharma𓃵 #Hitman #INDvAFG pic.twitter.com/cwUODsNN0p
— sports cricket (@cricket_new07) January 17, 2024
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (4), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. గత రెండు మ్యాచ్‌ల్లో హీరో శివమ్ దూబే కూడా (1) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. ఇక మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ (0) మరోసారి నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే గాల్లోకి లేపి క్యాచౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.
కరీమ్ జనత్@36: ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన అఫ్గాన్ పేసర్ కరీమ్ జనత్ 36 పరుగులు సమర్పించుకున్నాడు. రోహిత్, రింకూ దెబ్బకు ఈ ఓవర్లో ఏకంగా 5 సిక్స్‌లు, 1 ఫోర్ వచ్చాయి. టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 36 పరుగులిచ్చిన మూడో బౌలర్‌గా కరీమ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇదివరకు 2007లో స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), 2021లో అఖిల ధనంజయ (శ్రీలంక) 36 పరుగులిచ్చుకున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్లు
- రోహిత్ శర్మ (భారత్)- 5
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 4
- సూర్యకుమార్ యాదవ్- 4
ఈ ఇన్నింగ్స్‌లో నమోదైన పలు రికార్డులు
రోహిత్, రింకూ@ 190*: ఈ మ్యాచ్‌లో రోహిత్, రింకూ సింగ్ ఐదో వికెట్‌కు 190 పరుగులు జోడిచ్చారు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అతి పెద్ద భాగస్వామ్యం. ఇదివరకు 2022లో శాంసన్- దీపక్ హూడా (ఐర్లాండ్‌పై) 176 పరుగులు, 2017లో రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ (శ్రీలంకపై) 165 పరుగులు టాప్‌లో ఉన్నాయి.
రోహిత్@46: రోహిత్ కెరీర్లో 46 అంతర్జాతీయ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నాడు. టీ20ల్లో 5, వన్డేల్లో 31, టెస్టుల్లో 10 సెంచరీలు నమోదు చేశాడు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు బాదిన టీమ్ఇండియా కెప్టెన్‌గానూ రోహిత్ రికార్డు కొట్టాడు.
టీ20ల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
- శుభ్‌మన్ గిల్- 126* (2023)
- రుతురాజ్ గైక్వాడ్- 123* (2023)
- విరాట్ కోహ్లీ- 122* (2022)
- రోహిత్ శర్మ- 121* (2024)
-
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Most T20I hundreds in Men's cricket! 🔝 👏
Take. A. Bow Rohit Sharma 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J0hALcdhuF
">🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) January 17, 2024
Most T20I hundreds in Men's cricket! 🔝 👏
Take. A. Bow Rohit Sharma 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J0hALcdhuF🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) January 17, 2024
Most T20I hundreds in Men's cricket! 🔝 👏
Take. A. Bow Rohit Sharma 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J0hALcdhuF
-
FIFTY for @rinkusingh235 - his 2⃣nd T20I half-century! 👌 👌
— BCCI (@BCCI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/igug05vWXn
">FIFTY for @rinkusingh235 - his 2⃣nd T20I half-century! 👌 👌
— BCCI (@BCCI) January 17, 2024
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/igug05vWXnFIFTY for @rinkusingh235 - his 2⃣nd T20I half-century! 👌 👌
— BCCI (@BCCI) January 17, 2024
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/igug05vWXn
-