ETV Bharat / sports

'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​'గా పాక్​ క్రికెటర్​ - టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ 2021

ICC T20 Cricketers of the Year 2021: ఐసీసీ.. టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డులను ప్రకటించింది. పురుషుల్లో పాకిస్థాన్​ వికెట్​కీపర్​, బ్యాటర్​ మహ్మద్​ రిజ్వాన్​ ఈ అవార్డు దక్కించుకోగా.,. మహిళల్లో ఇంగ్లాండ్​ ప్లేయర్​ టమ్మీ ఈ పురస్కారాన్ని అందుకుంది.

ICC T20 Cricketers of the Year
టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్
author img

By

Published : Jan 23, 2022, 3:18 PM IST

Updated : Jan 23, 2022, 4:24 PM IST

ICC T20 Cricketers of the Year 2021: టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డును ప్రకటించింది ఐసీసీ. పాకిస్థాన్​ వికెట్​కీపర్​, బ్యాటర్​ మహ్మద్​ రిజ్వాన్​కు ఈ అవార్డు దక్కింది. మహిళా క్రికెటర్లలో ఇంగ్లాండ్​ ప్లేయర్​ టమ్మీకి(Tammy Beaumont) ఈ పురస్కారం వరించింది.

2021లో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్‌ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్‌ రేట్‌తో 1,326 పరుగులు సాధించాడు. ఏకంగా 73.66 సగటుతో ఈ రన్స్‌ చేయడం విశేషం.

గతేడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ రిజ్వాన్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో పాక్‌ ఫైనల్‌కు చేరింది. ఇందులో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రిజ్వాన్‌ నిలిచాడు. గతేడాది మొదటినుంచి పరుగుల వరద పారిస్తూ వస్తున్నాడు. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. టీ20ల్లో కెరీర్‌లోనే తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించాడు. వెస్టిండీస్‌తో కరాచీలో జరిగిన పోరులో 87 పరుగులు సాధించాడు. రానున్న ప్రపంచకప్‌లోనూ రిజ్వాన్‌ తన ఉత్తమ ఆటతీరును కొనసాగించాలని పాక్‌ కోరుకుంటోంది.

ICC T20 Cricketers of the Year
టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్ మహ్మద్​ రిజ్వాన్​

టమ్మీ.. 2021 టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్​గా నిలిచింది. న్యూజిలాండ్​ గడ్డపై ఆతిథ్య జట్టుతో జరిగిన సిరీస్​లో ఆమె టాప్​ స్కోరర్​గా నిలిచింది. మూడు మ్యాచుల్లో 102 పరుగలు చేసింది. భారత్​తో జరిగిన ఓ మ్యాచ్​లోనూ హాఫ్​ సెంచరీ చేసింది. తమ దేశంలో న్యూజిలాండ్​తో జరిగిన మరో సిరీస్​లోనూ 113 అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా నిలిచింది.

ICC T20 Cricketers of the Year
టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ టమ్మీ

ఇదీ చూడండి: 'కోహ్లీని కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించారు'

Last Updated : Jan 23, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.