ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియాలో కరోనా సోకింది పంత్కేనని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఎనిమిది రోజుల క్రితమే పంత్‌కు కరోనా సోకిందని, స్నేహితుని ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెలలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్ కోసం గురువారం దుర్హామ్ బయలుదేరనున్న జట్టుతో పంత్ వెళ్లలేదని వెల్లడించారు. పంత్ హోటల్లో లేనందున మిగతా ఆటగాళ్లకు వైరస్ సోకలేదని తెలిపారు.
అదే కారణమా?
ఇటీవల పంత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు యూరో కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్-జర్మనీ మ్యాచ్‌ను స్టేడియానికి వెళ్లి చూశారు. ఈ సమయంలో వీరు అభిమానులతో ఫొటోలు దిగారు. ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇందులో భౌతికం దూరం పాటించకుండా, మాస్క్ లేకుండా ఆటగాళ్లు ఉండటం చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఇలా చేస్తే కరోనా రాదా? అంటూ మండిపడ్డారు. బీసీసీఐ కూడా పంత్‌కు కరోనా రావడం వెనుక కారణం ఈ మ్యాచ్‌లకు హాజరుకావడమేనని భావిస్తోంది.
-
Good experience watching ⚽️. 🏴 vs 🇩🇪 pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good experience watching ⚽️. 🏴 vs 🇩🇪 pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021Good experience watching ⚽️. 🏴 vs 🇩🇪 pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఓ ఇండియన్ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ అనంతరం క్రికెటర్లకు 20 రోజుల పాటు విరామంలో ఉన్నారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో 23 మంది ఇండియన్ క్రికెటర్లు దుర్హామ్‌లో బయోబబుల్‌లో ఉండాల్సి ఉంది.