ETV Bharat / sports

Richa Ghosh Birthday : బర్త్​డేకు రెండ్రోజుల ముందే 'గోల్డ్ మెడల్'.. 8 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ పార్టీ​! - మహిళా క్రికెటర్​ రిచా ఘోష్​ జన్మదిన వేడుకలు

Richa Ghosh Birthday : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం సాధించిన తుది జట్టులోని సభ్యురాలైన​ రిచా ఘోష్​ మరో రెండు రోజుల్లో(సెప్టెంబర్​ 28) పుట్టినరోజు జరుపుకోనుంది. అయితే ఈమె చాలా ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి బర్త్​డేను సెలబ్రేట్​ చేసుకోబోతుండటం విశేషం. ఈ సందర్భంగా ఆమె తండ్రి ఈటీవీ భారత్​తో స్పెషల్​ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం..

Asian Games Gold Medalist Richa To Spend Birthday At Home After Long Time
Richa Ghosh Birthday With Family After Long Time
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 7:09 PM IST

Updated : Sep 26, 2023, 7:23 PM IST

Richa Ghosh Birthday : చైనా హాంగ్​జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత మహిళా క్రికెట్​ జట్టు... లంకేయులపై తుది పోరులో 19 పరుగుల తేడాతో విజయ సాధించి చరిత్ర సృష్టించింది. క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి జట్టుగా ​ నిలిచింది. దీంతో టీమ్​ఇండియా అమ్మాయిల జట్టుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

చాలా ఏళ్ల తర్వాత!.. అయితే ఈ విజయం సాధించిన ​ఫైనల్​ జట్టులో సభ్యురాలైన టీమ్​ఇండియా ప్లేయర్​ రిచా ఘోష్​ సెప్టెంబర్​ 28న(గురువారం) తన 20వ ఏటలోకి అడుగుపెట్టబోతుంది. ఈమె బంగాల్​.. డార్జిలింగ్​ జిల్లాలోని సిలిగురి పట్టణానికి చెందిన అమ్మాయి. అయితే ఈమె దాదాపు 7, 8 సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోబోతుండటం విశేషం. ఇందుకు సంబంధించి రిచా కుటుంబ సభ్యులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో మరో బంగాల్​ క్రికెటర్​ టిటాస్ సాధు కూడా సందడి చేయనుంది.

ఎంతో గర్వాంగా ఉంది.. దేశానికి బంగారు పతకాన్ని సాధించిన జట్టులో తమ అమ్మాయి ఉండటం తమకు ఎంతో గర్వంగా ఉందని రిచా ఘోష్​ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. సెప్టెంబర్​ 27న బుధవారం రిచా సిలిగురికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. రిచా.. గత 7-8 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు నాడు ఏదో ఓ టోర్నమెంట్ల కోసం వివిధ ప్రాంతాల్లో ఉంటోందని చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత ఆమె తమతో కలిసి బర్త్​డే సెలబ్రేట్​ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఈ వేడుకను నిర్వహించి ఆమెకు సర్​ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రిచాకు ఎంతో ఇష్టమైన పలు రకాల వంటకాలను.. ఆమె తల్లి వండి తినిపించబోతున్నట్లు చెప్పారు.

"ఆదివారం రాత్రి రిచాతో నేను ఫోన్​లో మాట్లాడాను. కానీ క్రికెట్​ గురించి ఏమి మాట్లాడుకోలేదు. ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నాము. చివరగా సోమవారం జరగబోయే మ్యాచ్​కు తనకు విషెస్​ చెప్పాను. ఇతర టోర్నమెంట్లలో నెగ్గిన విజయాల కన్నా ఈ ఆసియా క్రీడల్లో విజయం అనేది రిచాకు ఓ బిగ్​ అచీవ్​మెంట్​. అసియా క్రీడల్లో గెలవాలన్నది ప్రతిఒక్కరి కల. దానిని నా కూతురు నెరవేర్చుకుంది. అందుకు గర్వంగా ఫీల్​ అవుతున్నాను. ఇతర ప్లేయర్లు కూడా అద్భుతంగా ఆడారు. ఇక సెప్టెంబర్​ 27న తను సిలిగురికి చేరుకుంటుంది."

- మన్​బేంద్రా ఘోష్​, రిచా ఘోష్​ తండ్రి

Asian Games Gold Medalist Richa To Spend Birthday At Home After Long Time
రిచా ఘోష్

Last Updated : Sep 26, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.