ETV Bharat / sports

హెడ్​​కోచ్​గా ద్రవిడ్​ను తప్పించనున్న బీసీసీఐ.. కారణం అదేనా! - టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ

బోర్డులో సమూల మార్పులే లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని సమాాచారం. అందులో భాగంగా టీమ్ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రావిడ్​ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు వివరాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.

end of rahul dravid
end of rahul dravid
author img

By

Published : Dec 6, 2022, 8:31 PM IST

Updated : Dec 6, 2022, 8:40 PM IST

భారత క్రికెట్​ జట్టు వరుస పరాజయాలతో విఫలమవుతుండడం వల్ల బోర్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం చుడుతోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా భారత క్రికెట్​ బోర్టు అడుగులు వేస్తోందని సమాచారం. అందులో భాగంగా టీ20 ఫార్మాట్​కు కొత్త కోచ్​ సహా కొత్త కెప్టెన్​ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం టీమ్​ఇండియాకు హెడ్​ కోచ్​గా ఉన్న రాహుల్​ ద్రావిడ్​పై వేటు వేసే అవకాశముంది. ఎందుకంటే ఇండియా 2007 నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్​ కప్​ గెలవలేదు. దానికి తోడు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ సెమీఫైనల్స్​లో ఇంగ్లాండ్​ చేతిలో ఓడిపోయింది. దీని కారణంగానే మార్పులు చేసే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది.

ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి వివరాలు వెల్లడించారని సమాచారం. "మేము ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాము. ఇక్కడ రాహుల్ ద్రవిడ్ లేదా ఎవరి సామర్థ్యం మీద అనుమానం కాదు. టైట్ షెడ్యూల్‌లను నిర్వహించడం, బోర్డులో ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉండటం అనే దాని గురించి ప్రశ్న. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ అనేది ప్రత్యేక స్పోర్ట్​, రెగులర్​ ఈవెంట్స్​ లాంటిది. దాని ప్రకారం మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. త్వరలో టీమ్​ఇండియాకు కొత్త కోచ్​ రాబోతున్నారు. త్వరలోనే కొత్త కెప్టెన్​ను కూడా అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత కోచ్​ను కూడా. అయితే ఇప్పటి వరకు ఏదీ ఫైనల్​ కాలేదు" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

టీ20కి కొత్త కెప్టెన్​ హార్దిక్​ పాండ్య?
టీ20 ఫార్మాట్​కు కూడా కొత్త కెప్టెన్​ ఎంపిక అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్​ హర్బజన్​​ సింగ్​ కూడా గళం విప్పారు. టీ20కి కొత్త కెప్టెన్​ వస్తే నష్టం లేదని రవిశాస్త్రి అన్నారు. ఇటీవల రిటైర్మెంట్​ తీసుకున్న ఆటగాడైతేనే బాగుంటుందని హర్భజన్​ అభిప్రాయపడ్డారు. అయితే టీ20 కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ కచ్చితంగా ఉండబోరనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో హార్దిక్​ పాండ్యనే టీ20 కెప్టెన్​గా బీసీసీఐ ప్రకటించే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి : ఈ ఆరుగురు ఫేమస్​ క్రికెటర్ల బర్త్​ డే ఒకే రోజు వారెవరో తెలుసా

తొలగించనున్న స్టేడియం 974 చివరిసారిగా చూసేయండి

Last Updated : Dec 6, 2022, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.