Jadeja Ruled Out : టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కుడి మోకాలి నొప్పితో బాధపడుతూ ఆసియా కప్ టోర్నీకి దూరమైన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
''జడేజా కుడి మోకాలి గాయం చాలా తీవ్రంగా ఉంది. అతను మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంది. దీంతో కొంత కాలం పాటు తను మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. అతడి అంతర్జాతీయ పునరాగమనం గురించి ఎన్‌సీఏ వైద్య బృందం స్పష్టత ఇవ్వలేదు. రానున్న మూడు నెలలు అతడు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.'' అని బీసీసీఐ సీనియర్ అధికార ప్రతినిధి ఓ వార్త సంస్థకు తెలిపాడు.
అయితే.. ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉందని.. జడేజాపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని స్పష్టం చేశాడు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు.
ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల అనంతరం మోకాలి గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో కీలక వికెట్ తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ ఉత్తమ సేవలందించే ఈ స్టార్ ఆల్‌రౌండర్ పెద్ద టోర్నీకి దూరమవడం టీమ్‌ఇండియాకు పెద్దలోటే.
ఇవీ చూడండి: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్‌కు 'బిగ్' షాక్.. విధ్వంసకర ప్లేయర్ దూరం
దాదా ఎంత పని చేశావ్.. మెగా బ్లాక్ బస్టర్ ట్రైలర్ సీక్రెట్ తెలిసిపోయిందిగా