Jadeja Fielding: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ను ప్రశంసించాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. ప్రపంచ క్రికెటర్లలో జడేజా ఓ అత్యుత్తమ ఫీల్డర్ అని అన్నాడు. టీమ్ఇండియా మాజీ సారథి అజహరుద్దీన్ కూడా మైదానంలో చురుగ్గా ఉండేవాడని, గొప్ప ఫీల్డర్‌గా రాణించాడని గుర్తుచేసుకున్నాడు.
"ఫీల్డింగ్ ఎలా ఉందో నిర్ణయించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అజహరుద్దీన్ టీమ్ఇండియా తరఫున ఆడిన తొలినాళ్లలో ఫిట్నెస్ కల్చర్ లేదు. కానీ, 1990 నుంచి అది ప్రారంభమైంది. గొప్ప ఫీల్డింగ్ నైపుణ్యం ఉన్న అజహరుద్దీన్ వల్లే జట్టులోకి ఈ ఫిట్నెస్ కల్చర్ వచ్చింది." అని శ్రీధర్ అన్నాడు.
రవీంద్ర జడేజా కూడా అజహరుద్దీన్ తరహాలో చురుకైన ఫీల్డర్ అని శ్రీధర్ పేర్కొన్నాడు. బౌండరీ వద్ద ఛేజ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపేందుకు జడేజా పూర్తిగా కృషి చేస్తాడని తెలిపాడు. 2014 నుంచి 2021 వరకు టీమ్ఇండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు శ్రీధర్.
ప్రస్తుతం కుడి చేయి మోచేతికి గాయమైన కారణంగా జడేజాకు విశ్రాంతి లభించింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టీమ్ఇండియాలో జడేజాకు అవకాశం లభించలేదు.
ఇదీ చదవండి: