ETV Bharat / sports

జడేజాకు ఫిట్​నెస్​ పరీక్ష.. బ్యాక్​ టు రంజీ.. సత్తా చాటితే జాతీయ జట్టులోకి!

author img

By

Published : Jan 15, 2023, 3:51 PM IST

భారత ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాకు క్రికెట్​ బోర్డు యాజమాన్యం మెలిక పెట్టింది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో ఆడాలంటే.. ముందుగా రంజీ ట్రోఫీ మ్యాచ్​లలో తన ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలని స్పష్టం చేసింది.

Ravindra Jadeja Fitness Test Ranji Trophy
Ravindra Jadeja

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా తన ఫిట్​నెస్​ను నిరూపించేందుకు తమిళనాడుతో జరిగే సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ పోరులో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్​ ఫార్మాట్​లో అర్హత పొందాలంటే దేశీయ క్రికెట్​లో జడేజా సత్తా చాటాలని బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబరులో కుడి మోకాలికి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఆసియా కప్​కు దూరమయ్యాడు జడ్డూ. అయితే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్​సీఏ) కోలుకున్న జడేజా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పుర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే 4 టెస్టుల సిరీస్​లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్​లకు ఎంపిక చేసిన 17 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అయితే, అతడి స్థానం ఖరారు కావాలంటే ఫిట్​నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి చెన్నైలో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు జడేజా సన్నద్ధమయ్యాడు. సౌరాష్ట్ర తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. జడేజాకు ఎన్​సీఏలో చికిత్స పూర్తయినందున ఈ వారమే బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్​ను ప్రారంభించాడు. లెఫ్ట్​హ్యాండ్​ బ్యాటర్​గా అయిన జడేజా.. జట్టులో కీలకంగా మారతాడని యాజమాన్యం భావిస్తోంది. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్​ పంత్ ఆసీస్​ మ్యాచ్​కు దూరమయ్యాడు. పంత్​ స్థానంలో జడేజాను ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నరు.

'జడేజా సౌరాష్ట్ర తరఫున ఆడితే మంచిదే. బహుశా అతను ఆడతాడు అనుకుంటున్నా' అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ అన్నారు. ఇక జడేజా స్పిన్​.. ఆసీస్​ నాలుగు సిరీస్​ల పోరులో కీలకంగా మారే అవకాశం ఉంది. జడేజా బౌలింగ్ మెరుగ్గా ఉంటే గనుక వరుసగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్​లో భారత్​ గొప్ప ప్రదర్శనకు సహాయపడుతుంది.

2017లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్​ సిరీస్‌ పోరులో భారత్​ విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్​లో జడేజా 25 వికెట్లు పడగొట్టాడు. అలాగే 127 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్‌గా నిలిచాడు. భారత్​ ఈ సిరీస్​ను 2-1 ఆధిక్యంతో గెలిచింది. ఇక 2017 నుంచి జడేజా 19 టెస్టుల్లో ఆడి రెండు సెంచరీలతో పాటు ఏడు హాఫ్​ సెంచరీలు చేశాడు. మొత్తంగా 19 టెస్టుల్లో జడేజా 898 పరుగులు చేసి 82 వికెట్లు సాధించాడు. అయితే రంజీ ట్రోఫీలో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్​గా రవీంద్ర జడేజా పేరిట రికార్డు ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.