ETV Bharat / sports

అశ్విన్​ ఖాతాలో మరో రికార్డు.. నెంబర్​వన్ బౌలర్​గా! - అశ్విన్​ ఖాతాలో మరో రికార్డు.

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా ఘనత వహించాడు.

Ashwin
Ashwin
author img

By

Published : Nov 27, 2021, 3:37 PM IST

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా రికార్డుకెక్కాడు. న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో విల్ యంగ్ వికెట్ తీసిన అనంతరం ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్ల జాబితాలో 39 వికెట్లతో పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిదీని కిందకునెట్టి అగ్రస్థానానికి చేరాడు అశ్విన్. ఇంగ్లాండ్​తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్​లో 32 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడీ స్పిన్నర్. అలాగే ఈ సిరీస్​తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో బ్యాట్​తోనూ మెరిసి జట్టుకు విజయాల్ని అందించాడు.

ఇవీ చూడండి: PBKS IPL 2022: రాహుల్ ఎఫెక్ట్.. ఒక్కరూ వద్దంటున్న పంజాబ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.