ETV Bharat / sports

గ్రాండ్​గా IPL ప్రారంభోత్సవ వేడుక.. రష్మిక, తమన్నా డ్యాన్స్​ షో!

ఐపీఎల్​ 2023 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఓపెనింగ్ సెర్మనీలో రష్మిక, తమన్నా లైవ్ పెర్​ఫార్మెన్స్ డ్యాన్స్​​ చేయబోతున్నట్లు సమాచారం.

IPL 2023 rashmika tamannah
IPL 2023: గ్రాండ్​గా ప్రారంభోత్సవ వేడుక.. రష్మిక, తమన్నా డ్యాన్స్​ షో!
author img

By

Published : Mar 23, 2023, 5:15 PM IST

వరల్డ్​వైడ్​గా అత్యంత క్రేజ్‌ ఉన్న టీ20 లీగుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)​ ఒకటి. రిచెస్ట్​ క్రికెట్​ లీగ్​ కూడా ఇదే. ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ క్రికెట్​ పండగ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఘనంగా మొదలుకానుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఐపీఎల్‌ 2023 ప్రారంభ వేడుకల్లో నేషనల్​ క్రష్​ రష్మిక మంధాన, తమన్నా భాటియా సందడి చేయనున్నారని తెలిసింది. లైవ్‌ డ్యాన్స్​ పెర్ఫార్మెన్స్‌ చేయనున్నారని సమాచారం. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్​ చేస్తోందట. అలా ఇందులో భాగంగానే.. గతంలోలా అందాల తారలను రంగంలోకి దింపనుందట. రష్మిక, తమన్నలతో పాటు మరికొంతమంది బాలీవుడ్​ యాక్టర్స్​ను తీసుకురానుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్‌ అవే ఫార్మాట్​లో ఈ మెగాలీగ్​ జరుగుతుండటం వల్ల.. అభిమానులు ఈ మెగా టోర్నీకోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఇలా గ్రాండ్​గా ప్లాన్ చేస్తుందట.

కాగా, ఐపీఎల్‌ 16వ తాజా ఎడిషన్‌ మార్చి 31న అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌- డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌తో ఈ సీజన్ అట్టహాసంగా మొదలుకానుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభయ్యే అరగంట ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ డబ్ల్యూపీఎల్​లో కూడా ప్రారంభోత్సవ వేడుకలను గ్రాండ్​గా నిర్వహించింది బీసీసీఐ. అందులో కియారా అద్వాణీ, కృతిసనన్​ స్టేజ్​పై చిందులేస్తూ ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించారు. ఇకపోతే ఈ ఐపీఎల్​లో కొత్త రూల్స్​ అమలులోకి రానున్నాయి. తాజా సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్‌కు రివ్యూ తీసుకునే అవకాశం.. వంటి కొత్త నిబంధనలతో పాటు టాస్​ వేశాకే తుది జట్టును ప్రకటించేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఈ మెగాటోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరగనుంది.

మొత్తంగా పది టీమ్స్​ పాల్గొనే ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో 70 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడేసి మ్యాచ్‌లను హౌం గ్రౌండ్​లో, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌-ఏలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉండగా.. గ్రూప్‌-బీలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి. ఈ మ్యాచులన్నింటి కోసం 12 వేదికలను నిర్ణయించారు. అహ్మదాబాద్‌, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జయ్‌పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకటి.. రాత్రి 7.30 గంటలకు మరొకటి నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: బురఖాలో సానియా మీర్జా.. నెట్టింట ఫొటోలు వైరల్​.. మరి షోయబ్​ ఎక్కడబ్బా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.