ETV Bharat / sports

ఐపీఎల్​కు పాకిస్థాన్​ సవాల్​.. ఎలా ఆడతారో చూస్తామంటూ..!

Ramiz Raza on IPL: పాకిస్థాన్​ సూపర్ లీగ్​లో వచ్చే ఏడాది నుంచి వేలం ప్రక్రియను ప్రవేశపెడతామన్నాడు పీసీబీ ఛైర్మన్​ రమీజ్​ రాజా. అప్పుడు ఐపీఎల్​లో ఆటగాళ్లు ఎలా ఆడతారో చూస్తామని చెప్పాడు.

Ramiz Raza
పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్
author img

By

Published : Mar 17, 2022, 11:17 AM IST

Ramiz Raza on IPL: ప్రతిష్ఠాత్మక ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ను (ఐపీఎల్​) సవాలు చేశాడు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఛైర్మన్​ రమీజ్​ రాజా! పాకిస్థాన్​ సూపర్ లీగ్​లో (పీఎస్​ఎల్​) వచ్చే ఏడాది నుంచి వేలం ప్రక్రియను ప్రవేశపెడతామని.. అప్పుడు ఐపీఎల్​లో ఎవరు ఆడతారో చూస్తామని చెప్పాడు. ఈ మేరకు ఇటీవలే ఓ క్రీడా ఛానెల్​తో వ్యాఖ్యానించాడు.

"పీసీబీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సొంత ఆదాయ వనరుల్ని సృష్టించాలి. మా వద్ద ప్రస్తుతం పీఎస్​ఎల్​, ఐసీసీ నిధులు మాత్రమే ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి పీఎస్ఎల్​లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. దీనిపై ప్రాంఛైజీలతో చర్చిస్తాం. పాకిస్థాన్ క్రికెట్​కు ఆదాయం పెరిగితే.. మా గౌరవం కూడా పెరుగుతుంది. పీఎస్​ఎల్​లో వేలం ప్రక్రియ మొదలైతే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్​ఎల్​ను దాటి వెళ్లి ఐపీఎల్​లో ఎవరు ఆడతారో మేమూ చూస్తాం."

-రమీజ్​ రాజా, పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్​

పీఎస్​ఎల్​ను ఐపీఎల్​ స్థాయికి తీసుకువెళ్లాలంటే డ్రాఫ్టింగ్​ విధానం నుంచి వేలానికి మార్చాలని ఆ దేశ క్రికెటర్​ షోయబ్​ మాలిక్​ కూడా సూచించాడు. అప్పుడే స్టార్​ ఆటగాళ్లు ఈ టోర్నీ వైపు మొగ్గుచూపుతారని చెప్పాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్​ బయోబబుల్​ కొత్త నిబంధనలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.