ETV Bharat / sports

పీసీబీ ఛీప్​ రమీజ్​ రాజాపై వేటు.. కొత్త ఛైర్మన్​ ఎవరంటే? - పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వివాదం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్​గా ఉన్న రమీజ్ రాజాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. కొత్త ఛైర్మన్​ను నియమించింది.

Ramiz Raja removed as PCB chairman
పీసీబీ ఛీప్​ రమీజ్​ రాజాపై వేటు.. కొత్త ఛైర్మన్​ ఎవరంటే?
author img

By

Published : Dec 22, 2022, 11:11 AM IST

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ రమీజ్ రాజాపై వేటు పడింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్​ చేతిలో ఘోర పరాభావాన్ని(వైట్​వాష్​) ఎదుర్కొన్న నేపథ్యంలో పీసీబీ చైర్మెన్ బాధ్యతల నుంచి రమీజ్ రాజాను తప్పిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 మంది సభ్యులతో కూడిన మరి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ.. కొత్త చైర్మన్‌గా నజమ్ సేథిని నియమించింది. ఈ నూతన ఛైర్మన్ నజమ్ సేథి నియామకాన్ని పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఆమోదించినట్లు పాక్ మీడియా పేర్కొంది.

17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్​.. తన అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో పాకిస్థాన్ ఆట తీరు కన్నా మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌లపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రమీజ్ రాజా.. పీసీబీ ఛైర్మన్‌గా జట్టుకు చేసింది ఏం లేదని, ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్‌కు సరైన పిచ్‌లను కూడా ఏర్పాటు చేయించలేకపోయాడని విమర్శలను మూటగట్టుకున్నాడు.

మరోవైపు ఈ సిరీస్​ సమయంలో సెక్యూరిటీతో జరిగిన గొడవపై పాక్ కెప్టెన్​ ఆజామ్ నిరసన వ్యక్తం చేయడం, అలానే పిచ్​ల విషయంపై కూడా అసంతృప్తిగా ఉండటం.. వంటి ఘటనలు కూడా రమీజ్ రాజా పదవికి ఎసరు తెచ్చాయి. అంతేకాకుండా టీమ్​ఇండియాతో క్రికెట్ ఆడే విషయమై పదే పదే మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా రమీజ్​రాజాపై వేటు పడటానికి ఓ కారణమైంది!.

ఇదీ చూడండి: భారీగా పెరిగిన IPL విలువ.. రూ.87 వేలకోట్లకు పైగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.