ETV Bharat / sports

'కోచ్​గా నన్ను అందుకే ఎంపిక చేయలేదా?'

author img

By

Published : May 15, 2021, 7:38 PM IST

జట్టులో ఉన్న స్టార్​ సంస్కృతి మా​రాలని సూచించాడు భారత మహిళా క్రికెట్​ జట్టు మాజీ కోచ్​ డబ్ల్యూవీ రామన్​. తనపై వస్తోన్న అసత్య ప్రచారాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్​సీఏ, బీసీసీఐకి లేఖ రాశాడు. తనను కోచ్​ పదవి నుంచి తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

wv raman
డబ్ల్యూవీ రామన్

తన కీర్తిని దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు భారత మహిళా క్రికెట్​ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్​​. ఈ విషయాన్ని నేషనల్​ క్రికెట్​ అకాడమీ హెడ్​​ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ​ దృష్టికి తీసుకెళ్లాడు. వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఇటీవల మహిళా క్రికెట్​ జట్టు కోచ్​ పదవికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో అప్పటివరకు కోచ్​గా వ్యవహరించిన రామన్​ను పక్కనపెట్టి గతంలో ఆ బాధ్యతలు నిర్వర్తించిన రమేశ్​ పొవార్​ను ఎంపిక చేసింది క్రికెట్​ అడ్వైసరీ కమిటీ. అయితే తనను ఎంపిక చేయకపోవడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు రామన్​. తాను కోచ్​గా పనికిరానని భావిస్తే తప్ప మరే ఇతర కారణాల(అసత్య ప్రచారం) వల్ల పక్కనపెట్టినా.. అది తనను తీవ్రంగా కలచివేస్తుందని చెప్పాడు. అవసరమైతే తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో మదన్​లాల్​ నేతృత్వంలోని కమిటీ పారదర్శకంగా వ్యవహరించలేదని, సరైన కారణం లేకుండానే రామన్​ను పక్కన పెట్టారన్న ఆరోపణలొస్తున్నాయి.

పేరు చెప్పకుండానే.. జట్టులో ప్రస్తుతమున్న స్టార్ సంస్కృతి మారాలని లేఖలో పేర్కొన్నాడు రామన్​. ఈ కల్చర్​ జట్టుకు చేటు చేస్తుందని ఆరోపించాడు. దానికి స్వస్తి పలికేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి: కొత్త కోచ్ ఎంపికపై మహిళల క్రికెట్​లో రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.