ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ జట్టులో బుమ్రా.. ద్రవిడ్ ఏం అన్నాడంటే? - రాహుల్ ద్రవిడ్​ బుమ్రా ఫిట్ నెస్​

బ్యాక్​ పెయిన్​తో బాధపడుతున్న బుమ్రా టీ20 ప్రపంచకప్​కు అందుబాటులో ఉండే విషయమై మాట్లాడాడు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్. ఏమన్నాడంటే..

rahul dravid bumrah fitness
బుమ్రా ఫిట్​నెస్​పై ద్రవిడ్​
author img

By

Published : Oct 1, 2022, 6:50 PM IST

వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన బుమ్రా.. టీ20 ప్రపంచకప్​కు కూడా అందుబాటులో ఉండడని వార్తలొచ్చాయి. అసలు ఇంతకీ అతడు వరల్డ్​కప్​ టీమ్​లో ఉంటాడా లేదా అనేది ప్రశ్న అభిమానుల మదిలో తెగ మెదులుతోంది. అయితే బుమ్రా గాయంపై ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. 'బుమ్రా ఇంకా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించలేదు. దీనిపై ఉత్కంఠ ఉంది. అతడు జట్టుకు దూరమైనట్లు ఇప్పుడే చెప్పకండి' అని పేర్కొన్నాడు. తాజాగా టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ విషయమై మాట్లాడాడు.

"ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ప్రకారం.. బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో లేడు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ వైద్య బృందం పరిశీలించి పరిస్థితి ఏంటనేది వెల్లడిస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందనే తెలియాలంటే వేచి చూడాలి. గత మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించలేదు. నిపుణులు చెప్పేదానిపైనే నేను ఆధారపడతాను. ప్రస్తుతం బుమ్రాను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే తప్పించారు. అధికారికంగా ఇప్పటికీ అతడు టీ20 ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగినట్లు కాదు. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం" అని ద్రవిడ్‌ అన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మిగతా రెండు టీ20లకు సిరాజ్‌ను ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: Asiacup: టీమ్​ఇండియా శుభారంభం.. లంకపై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.