ETV Bharat / sports

గ్రౌండ్​లో కొడుకు ఆట - మెట్లపై కూర్చుని చూసిన ద్రవిడ్​ - సింప్లిసిటీ అంటే ఇదే కదా! - rahul dravid family

Rahul Dravid Simplicity : టీమ్ఇండియా హెడ్​కోచ్ రాహుల్ ద్రవిడ్.. మరోసారి తన సింప్లిసిటీతో ప్రశంసలు అందుకుంటున్నాడు. సాధారణ వ్యక్తిలాగే రాహుల్ తన సతీమణి విజేతతో కలిసి.. స్టేడియంలో మెట్లపై కూర్చొని తన కుమారుడి ఆటను చూశాడు.

Rahul Dravid Simplicity
Rahul Dravid Simplicity
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 7:50 PM IST

Updated : Dec 2, 2023, 8:11 PM IST

Rahul Dravid Simplicity : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఎంత సింపుల్​గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి తన సింప్లిసిటీతో నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాడు. శుక్రవారం అండర్ - 19 కూచ్ బిహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్​లో భాగంగా కర్ణాటక - ఉత్తరాఖండ్ జట్లు తలపడ్డాయి. అయితే రాహుల్ పెద్ద కుమారుడు సమిత్ (18).. ఈ టోర్నీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్​లో తన కుమారుడి ఆట చూసేందుకు రాహుల్.. ఆయన సతీమణి విజేతతో కలిసి మైసూర్ వడయార్ స్టేడియానికి వచ్చాడు.

అయితే ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాకుండా.. సాధారణ వ్యక్తిలాగా తన భార్యతో కలిసి స్టేడియంలో మెట్లపై కూర్చొని తమ కుమారుడి ఆటను చూశాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్​ పొజిషన్​లో ఉండి కూడా.. మామూలు వ్యక్తిలా మెట్లపై కూర్చోని మ్యాచ్ చూడడం స్థానికంగా అందర్నీ ఆకర్షించింది. 'అందరు తల్లిదండ్రుల లాగే నేనూ నా కుమారుడి ఆట చూడడానికి వచ్చా. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు' అని రాహుల్ అన్నాడు. ఇక గ్రౌండ్​లో రాహుల్ కనిపించగానే.. ఫ్యాన్స్ సెల్ఫీ కోసం ఎగబడ్డారు.

భార్యతో కలిసి మెట్లపై కూర్చొని కుమారుడి ఆట చూస్తున్న రాహుల్

  • India head coach Rahul Dravid and his wife Vijeta watch the proceedings of the Cooch Behar U-16 Trophy match between Karnataka and Uttarakhand at the SDNRW Ground in Mysuru on Friday. Samit Dravid is a part of the squad pic.twitter.com/I7Ww0Eh7TP

    — Manuja (@manujaveerappa) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక మ్యాచ్​విషయానికొస్తే.. ఉత్తరాఖండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసేసరికి ఉత్తరాఖండ్.. 232-9తో నిలిచింది. ఈ మ్యాచ్​లో ఆల్​రౌండర్ సమిత్.. 5 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీసుకోకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక రెండో రోజు నేడు (శనివారం) ఆట కొనసాగుతోంది. ఇదే టోర్నీలో సమిత్.. హిమాచల్ ప్రదేశ్, దిల్లీ జట్లపై 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఇక ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (14).. కర్ణాటక అండర్ - 14 జట్టుకు కెప్టెన్​గా కొనసాగుతున్నాడు.

India Tour Of South Africa : డిసెంబర్​లో భారత్.. సౌతాఫ్రికా ప్రర్యటనకు వెళ్లనుంది. వన్డే వరల్డ్​కప్ తర్వాత బ్రేక్ తీసుకున్న రాహుల్.. త్వరలోనే టీమ్ఇండియాతో కలవనున్నాడు. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య జట్టుతో 3 టీ20, 3 వన్డే, 2 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది.

ట్విస్ట్ ఇచ్చిన రాహుల్​ ద్రవిడ్​ - 'నేను ఇంకా సంతకం చేయలేదు'

రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పొడగింపు - బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్​మెంట్

Last Updated : Dec 2, 2023, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.