ETV Bharat / sports

కివీస్​తో తొలి టెస్టుకు రోహిత్ దూరం.. కెప్టెన్​గా రహానె! - కివీస్​తో టెస్టుకు కెప్టెన్​గా అజింక్యా రహానే

స్వదేశంలో న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​(ind vs nz test 2021)కు ఎవరు కెప్టెన్​గా ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ దూరం కానున్న నేపథ్యంలో రహానే కెప్టెన్​(ajinkya rahane captaincy in test)గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.

Rohit
Rohit
author img

By

Published : Nov 12, 2021, 8:05 AM IST

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌(ind vs nz test 2021)లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఎవరు నడిపిస్తారనే విషయంపై ఓ స్పష్టత వచ్చినట్లే! టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె ఆ మ్యాచ్‌లో సారథిగా వ్యవహరిస్తాడని సమాచారం.

ఈ నెల 17న కివీస్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20, రెండు టెస్టుల సిరీస్‌(ind vs nz test 2021) ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021) తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ స్థానంలో రోహిత్‌(rohit sharma captaincy news)కు ఆ పగ్గాలు అందించారు. కాగా, పని భారం కారణంగా కోహ్లీ సహా కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక వన్డే, టెస్టుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కొనసాగే కోహ్లీ.. కివీస్‌తో ఈ నెల 25న కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టుకూ(ind vs nz test 2021) దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆ టెస్టులో జట్టును కొత్తగా టీ20 సారథిగా ఎంపికైన రోహిత్‌ నడిపిస్తాడా? లేదా టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె సారథిగా వ్యవహరిస్తాడా?(ajinkya rahane captaincy in test) అనే సందేహాలు రేకెత్తాయి. బ్యాట్‌తో ఫామ్‌లో లేని రహానె కంటే కూడా రోహిత్‌(rohit sharma captaincy news)కే ఆ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపించాయి. కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌(ind vs nz test 2021)కు రోహిత్‌ దూరం కానున్నట్లు తాజా సమాచారం. దీంతో రహానేనే తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉంటాడు. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్న కోహ్లీనే సారథిగా వ్యవహరిస్తాడు.

ఇవీ చూడండి: టీమ్ఇండియా కొత్త కోచ్​ల ఖరారు.. ఫీల్డింగ్ కోచ్​గా దిలీప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.