Prithvi Shaw Double Century Scorecard : టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. తన వరుస వైఫల్యాలకు భారీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. పేలవ ఫామ్, ఇతర వివాదాలతో ఫేడ్ ఔట్ అయి.. భారత జట్టులో చోటు కోల్పోయిన అతడు రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‍లో డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. వన్డే కప్‍లో భాగంగా జరిగిన కౌంటీ క్రికెట్ లిస్ట్ ఏ మ్యాచ్‍లో 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగుల రికార్డ్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు.
England one day cup 2023 : 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ .. నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ... సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. మరో 48 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలా 129 బంతుల్లోనే 24 ఫోర్లు, 8 సిక్స్‌లతో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. మొత్తంగా 153 బంతుల్లో 244 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 39 బౌండరీలు ఉన్నాయి. అతడి భారీ స్కోరు నమోదు కావడం వల్ల.. నార్తాంప్టన్ షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 415 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ వన్డే కప్ టోర్నీలోనే ఆ జట్టు అత్యధిక భారీ స్కోర్ నమోదు చేసింది.
ఈ ఊచకోత ఇన్నింగ్స్‌తో పృథ్వీ షా పలు రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఆ రికార్డులేంటంటే..
- పృథ్వీ షా.. వన్డే కప్‌లో ఆలీ రాబిన్సన్(206, 2022) అత్యధిక వ్యక్తిగత స్కోరును బ్రేక్ చేశాడు.
- పురుషుల లిస్ట్ ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన బ్యాటర్ల లిస్ట్‌లో పృథ్వీ మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో అతడు 39 బౌండరీలు బాదాడు. అందులో 28 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.
- 2002లో చెల్టెన్‌హామ్, గ్లౌసెస్టర్ ట్రోఫీలో అలీ బ్రౌన్ 268 స్కోర్ తర్వాత.. షా 244 ఇంగ్లీష్ లిస్ట్ A క్రికెట్‌లో రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది.
- వన్డే కప్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గానూ షా నిలిచాడు.
Prithvi Shaw Hit Wicket : పాపం షా.. అరంగేట్ర మ్యాచ్లో చేదు అనుభవం
వర్షంలోనే పృథ్వీ షా బ్యాటింగ్ ప్రాక్టీస్.. టార్గెట్ వాళ్లేనా!