Praveen Kumar Lalith Modi : టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఇష్టం లేకపోయినా తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున ఆడినట్లు తెలిపాడు. లలిత్ మోదీ తనపై ఒత్తిడి తీసుకొచ్చినందుకు తాను ఆడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
"నేను RCB తరఫున ఆడాలని అనుకోలేదు. ఎందుకంటే బెంగళూరు నా స్వస్థలానికి (మేరఠ్) చాలా దూరంగా ఉంటుంది. నాకు ఏమో ఇంగ్లిష్ రాదు. అక్కడి ఆహారం కూడా నచ్చదు. మేరఠ్ దగ్గరగా దిల్లీ ఉండటం వల్ల ఆ ఫ్రాంచైజీకి ఆడాలని అనుకున్నాను. కానీ, ఓ వ్యక్తి పేపర్‌పై నాతో సంతకం పెట్టించుకున్నాడు. అప్పుడు అది ఐపీఎల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన పత్రం అని నాకు తెలీదు. ఈ విషయాన్ని లలిత్ మోదీ దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు అతడు నీ కెరీర్ ముగించేస్తానని బెదిరించాడు" అని ప్రవీణ్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్‌లో ప్రవీణ్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లైయన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 119 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడి 90 వికెట్లు తీశాడు.
Praveen Kumar Ball Tampering : బాల్ టాంపరింగ్ గురించి కూడా ప్రవీణ్ మాట్లాడాడు. గతంలో ఇలాంటివి జరిగేవని, పాకిస్థాన్ బౌలర్లే ఎక్కువగా చేసేవారని అన్నాడు. తన డ్రింకింగ్ అలవాటు వల్ల కోచింగ్ బాధ్యతలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు.
కేఎల్ రాహుల్ టీ20 భవిష్యత్తు ఏంటో? - రెస్ట్ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?