ETV Bharat / sports

Pat Cummins Captain:ఆస్ట్రేలియా టెస్టు సారథిగా కమిన్స్

Pat Cummins Captain: ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్​గా పాట్​ కమిన్స్​ను, వైస్​ కెప్టెన్​గా స్టీవ్ స్మిత్​ను నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇటీవలే టిమ్ పైన్​ సారథిగా తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

pat cummins, steve smith
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్
author img

By

Published : Nov 26, 2021, 9:33 AM IST

ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథిగా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్​ను(Pat Cummins Captain) నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా. వైస్​ కెప్టెన్ బాధ్యతలను స్టీవ్​ స్మిత్​కు(Steve Smith Vice Captain) అప్పగించింది.

మాజీ సారథి టిమ్ పైన్.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు కొద్ది రోజులపాటు దూరం కానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. తోటి సహోద్యోగురాలికి అసభ్యకరంగా టెక్స్ట్ చేసిన కారణంగా టిమ్​ పైన్ కెప్టెన్​ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు.

"పాట్ కమిన్స్ ఓ అద్భుతమైన ఆటగాడు. మంచి నాయకుడు. జట్టు సభ్యుల నుంచి క్రికెట్​ అభిమానుల నుంచి ఎంతో ప్రేమను సంపాదించాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్ జట్టు సీనియర్ ఆటగాళ్లలో అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉండటం చాలా గొప్ప విషయం." అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ పేర్కొన్నాడు.

టెస్టు కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశాడు పాట్ కమిన్స్. టిమ్​ పైన్​ గత కొన్నేళ్లుగా జట్టుకు సేవలందించిన విధంగానే ఆసీస్​ను ముందుకు నడిపిస్తానని పేర్కొన్నాడు. మరోవైపు స్టీవ్ స్మిత్​.. వైస్​ కెప్టెన్​గా సేవలందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. పాట్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. డిసెంబర్ 8న గబ్బా వేదికగా తొలి టెస్టు జరగనుంది.

ఇదీ చదవండి:

ఆసీస్ క్రికెటర్ పైన్ క్రికెట్​కు కొన్నాళ్లు దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.