ETV Bharat / sports

మళ్లీ పాకిస్థాన్​ పర్యటనకు కివీస్​.. ఈసారైనా అడతారా? - పాకిస్థాన్​కు న్యూజిలాండ్ జట్టు

న్యూజిలాండ్​ జట్టు మళ్లీ పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లనుంది. దానికి సంబంధించిన షెడ్యూల్​ను పాక్​ బోర్డు ప్రకటించింది.

Pakisthan board announces newzleand tour schedule
మళ్లీ పాకిస్థాన్​ పర్యటనకు కివీస్​.. ఈసారైనా అడతారా
author img

By

Published : Oct 10, 2022, 2:30 PM IST

పాకిస్థాన్​ బోర్డు.. తమ దేశ పర్యటనకు రానున్న న్యూజిలాండ్​ జట్టుకు సంబంధించిన షెడ్యూల్​ వివరాలను ప్రకటించింది. ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడేందుకు కివీస్‌ జట్టు.. రెండు సార్లు పాకిస్థాన్​కు రానున్నట్లు తెలిపింది. తొలి దశ పర్యటనలో భాగంగా పాక్‌తో విలియమ్సన్‌ సేన రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లలో తలపడనుంది.

డిసెంబర్‌ 27న కరాచీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. రెండో టెస్టు ముల్తాన్​ వేదికగా వచ్చే ఏడాది జనవరి 4 నుంచి జరగనుంది. ఆ తర్వాత అదే నెలలో 11,13,15 తేదీల్లో మూడు వన్డేల సిరీస్​ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కీవిస్‌ జట్టు పాక్‌ టూర్‌కు రానుంది. రెండో దశ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు(13,15,16,19,23), ఐదు వన్డేల సిరీస్​ను(ఏప్రిల్​ 26,28.. మే 1,4,7 తేదీల్లో) పాక్‌తో కివీస్‌ ఆడనుంది. కాగా గతేడాది 32ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌.. భద్రతా కారణాల దృష్ట్యా అఖరి నిమిషంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం పాకిస్థాన్​ జట్టు.. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లతో ట్రై సిరీస్‌ ఆడుతోంది.

ఇదీ చూడండి: నేను 'గే'.. స్టార్ ఫుట్​బాలర్ సంచలన ట్వీట్​​.. ఆ తర్వాత సూపర్​ ట్విస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.