భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే వీక్షించే అభిమానులకే కాదు.. మైదానంలోకి దిగే ఆటగాళ్లకూ టెన్షన్‌గా ఉంటుంది. ఆసియా కప్‌లో ఇప్పటికే ఒకసారి తలపడిన దాయాది జట్లు.. ఆదివారం మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి.
హాంకాంగ్‌పై పాక్ భారీ విజయం సాధించడంలో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (78*) కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. "భారత్‌తో ఎప్పుడు ఆడినా ఒత్తిడిగానే ఉంటుంది. ఆసియా ఖండంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మేం మాత్రం చాలా కామ్‌గా, ధైర్యంగా ఆడతాం. ఒత్తిడి మా మీద ఎలా ఉంటుందో.. టీమ్‌ఇండియా ఆటగాళ్లపైనా ఉంటుంది. నేను మా ఆటగాళ్లకు ఒకటే చెప్పా.. మనం ఆడుతోంది భారత్‌తోనా.. లేదా హాంకాంగ్‌తోనా అని చూడొద్దు. ఇది బ్యాట్ అండ్ బాల్‌కు మధ్య పోటీ మాత్రమేనని వివరించా. పెద్ద మ్యాచ్ అయితే మా ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉండాలి. కష్టపడటం మన చేతుల్లోనే ఉంటుంది.. ఫలితం మాత్రం దేవుడిదని నా నమ్మకం. మిగిలిన మ్యాచుల్లోనూ రాణించి ఫైనల్‌కు చేరతామని భావిస్తున్నా" అని రిజ్వాన్ తెలిపాడు.
మాకు అండగా నిలవండి.. ప్లీజ్
వరదలతో అతలాకుతలం అవుతున్న పాక్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలని మహమ్మద్ రిజ్వాన్ కోరాడు. హాంకాంగ్‌తో మ్యాచ్ అనంతరం ఈ మేరకు రిజ్వాన్ విజ్ఞప్తి చేశాడు. "ఇలాంటి సమయంలో ఒకటే విన్నపం. పాకిస్థాన్ వరదలతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. దయ చేసి ప్రతి ఒక్కరూ పాక్ ప్రజలకు అండగా నిలవండి. నేను ఇప్పటికే పాక్ పౌరులకు విజ్ఞప్తి చేశా. ప్రపంచ దేశాల్లోని అభిమానులు, ప్రజలు కూడా పాక్ ప్రజల కోసం ప్రార్థించాలని నా కోరిక. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నా" అని రిజ్వాన్ అన్నాడు. వరదలు, అంటు వ్యాధులతో పాకిస్థాన్ విలవిలలాడుతోంది. ఇప్పటి వరకు వరదల కారణంగా 1200 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇవీ చదవండి: సలామ్ సెరెనా.. ఎన్నో సవాళ్లు దాటి అత్యున్నత స్థాయికి.. కానీ చివరి కోరికతీరకుండానే
టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. ప్రపంచకప్‌కు స్టార్ ఆల్‌రౌండర్ డౌటే!