చాలా ఏళ్లుగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వయసుపై ఉత్కంఠ నెలకొంది. అతడు 1980లో పుట్టాడని పాక్ ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ తాను 1975లో జన్మించానని షాహిద్ తన ఆత్మకథలో బయటపెట్టాడు.
1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు అఫ్రిది. ఈ ఘనత16 ఏళ్ల వయసుకే అందుకున్నాడని అందరు అనుకున్నారు. కానీ అప్పటికీ తనకు 19 ఏళ్లని అఫ్రిది తెలిపాడు.
నిజానికి తన ఆత్మకథలోనూ తప్పుగా రాసుకున్నాడు అఫ్రిది. 1975లో పుట్టిన షాహిద్ 1996కు 21 ఏళ్లు ఉండాలి.. 19 సంవత్సరాలని పుస్తకంలో ప్రస్తావించడం గమనార్హం.
పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 అంతర్జాతీయ టీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు అఫ్రిది. 2016 టీ 20 ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు.