టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సూపర్-12 పోటీల్లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజీ మ్యాచ్(IND vs PAK T20 Match) ఆదివారం(అక్టోబర్ 24) దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై విజయం సాధిస్తే పాకిస్థాన్(Pakisthan Squad World Cup 2021) ఆటగాళ్లకు భారీ బోనస్ లభించనుందని ఓ నివేదిక పేర్కొంది.
ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ తలపడ్డ 12 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాదే పైచేయి. 5 టీ20, 7 వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం బాబర్ అజామ్సేన గెలిస్తే.. మ్యాచ్ ఫీజుకు 50 శాతం ఎక్కువ.. అంటే దాదాపు రూ. 1,70,000 ఎక్కువ ఇవ్వనున్నట్లు ఓ రిపోర్డ్ ద్వారా తెలిసింది.
ప్రస్తుతం పాక్ క్రికెటర్లకు ఒక్క మ్యాచ్‌కు రూ. 3,38,250 ఫీజు ఇస్తుండగా భారత్‌పై(T20 World Cup Team India ) గెలిస్తే వారికి రూ. 5 లక్షలకు పైగా తీసుకోనున్నారు. టీ20లో ప్రపంచ నెంబర్ వన్ టీమ్ ఇంగ్లాండ్‌పై గెలిస్తే కూడా పాక్ ఆటగాళ్లకు ఫుల్ బోనస్ రానుందని రిపోర్టు పేర్కొంది. ఒకవేళ టోర్నీ గెలిస్తే వారికి 300 శాతం ఎక్కువగా ఫీజు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో గెలిచి పూర్తి విశ్వాసంతో ఉన్న భారత్.. పాక్‌ను మరోసారి చిత్తు చేయాలని ఆశిస్తోంది. భారత్ విజయదుందుభి మోగించి 13-0తో పాక్‌పై పైచేయి సాధించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: