ETV Bharat / sports

'అందుకోసమే మేము లగేజ్ మోయాల్సి వచ్చింది' - షహీన్ అఫ్రిదీ క్లారిటీ - Pakistan Players Luggage Carrying Issue

Pakistan Players Luggage Carrying Issue : ఇటీవల పాకిస్థాన్ ప్లేయర్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎయిర్​పోర్టులో దిగిన వారి లగేజ్ వారే మోసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీంతో నెటిజన్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును తప్పుబట్టారు. కాగా, ఈ విషయంపై పాక్ ప్లేయర్ షహీన్ అఫ్రిదీ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

Pakistan Players Luggage Carrying Issue
Pakistan Players Luggage Carrying Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 1:54 PM IST

Updated : Dec 4, 2023, 4:43 PM IST

Pakistan Players Luggage Carrying Issue : మరో పది రోజుల్లో ఆస్ట్రేలియాతో, పాకిస్థాన్ మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడనుంది. ​ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే సిడ్నీ ఎయిర్​పోర్ట్​లో దిగిన తర్వాత, పాక్ ప్లేయర్లు వాళ్ల లగేజ్ వారే మోస్తూ ట్రక్కులో ఎక్కించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఆతిథ్య ప్లేయర్లను పట్టించుకోలేదంటూ కంగారూ బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఇలా చేయడం ఆస్ట్రేలియాకు కొత్త కాదంటూ నెటిజన్లు కంగారూ బోర్డుకు చురకలు అంటించారు. గతంలో కూడా అగ్ర జట్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక క్రికెట్ ప్రియుల ఆగ్రహానికి గురైందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు పాకిస్థాన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిదీ. తమ జట్టు ప్లేయర్లంతా స్వయంగా లగేజ్ ఎందుకు మోయాల్సి వచ్చిందో చెప్పాడు. కాన్​బెర్రాలో ప్రాక్టీస్ సెషన్​ జరుగుతున్న సమయంలో షహీన్ క్లారిటీ ఇచ్చాడు. 'మరో విమానాన్ని అందుకునేందుకు మాకు 30 నిమిషాల టైమ్ మాత్రమే ఉంది. అక్కడ కేవలం ఇద్దరు సిబ్బంది మాతో ఉన్నారు. అందుకే టైమ్ సేవ్ చేసేందుకే మేము వారికి హెల్ప్ చేశాం. జట్టును మేం ఫ్యామిలీగా భావిస్తాం. అందుకే ఒకరికొకరం సహాయం చేసుకున్నాం' అని అన్నాడు.

అయితే తమ దేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకడం సదరు ఆతిథ్య క్రికెట్ బోర్డు కనీస కర్తవ్యం. వారు పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేవరకు ప్లేయర్ల భద్రత, బస వంటి అన్నింటిని సౌకర్యాలను వారికి కలిగించాలి. ఎలాంటి ఆటంకం లేకుండా వారు మ్యాచ్​ల్లో పాల్గొనేలాగా చూడాలి. ఇవి ఆయా దేశాల క్రికెట్​ బోర్డులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు.

  • Pakistan Cricket Team at Sydney arranging their luggage were indeed a display of their own initiative. No mismanagement by the airport staff - the players voluntarily arranged their luggage in the truck as they preferred.#BabarAzam𓃵 #PAKvsAUS pic.twitter.com/sOosou7cr4

    — Cricket In Blood (@CricketInBlood_) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pakistan Vs Australia Test Series 2023 : ఇదిలా ఉండగా మూడు టెస్ట్​ మ్యాచ్​ల సిరీస్​ కోసం పాకిస్థాన్​ శుక్రవారం (డిసెంబర్​ 1న) ఆస్ట్రేలియా చేరుకుంది. పెర్త్​ స్టేడియం వేదికగా డిసెంబర్​ 14 నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టెస్ట్​ మ్యాచ్​ జరగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్​ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్- ఎమ్​సీజీలో జరగుతుంది. ఇక 2024 జనవరి 03 నుంచి 2024 జనవరి 07 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడే టెస్టులో పాక్, ఆసీస్ తలపడనున్నాయి.

'అవసరమైతే వరల్డ్​కప్​పై మళ్లీ కాళ్లు పెడతా'- మిచెల్ మార్ష్​ సంచలన వ్యాఖ్యలు!

భారత్​-ఆసీస్ నాలుగో టీ20కి కరెంట్ కష్టాలు- జనరేటర్లపైనే భారం- గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి!

Last Updated : Dec 4, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.