లియామ్ లివింగ్ స్టోన్.. ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసినా ఆ జట్టును గెలిపించలేకపోయాడు. పాకిస్థాన్‌తో.. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడింది ఆతిథ్య జట్టు. లివింగ్ స్టోన్ 42 బంతుల్లోనే శతకం సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు.. 232 పరుగులు చేసింది. ఓపెనర్లు రిజ్వాన్(63), బాబర్ అజామ్(85) చెలరేగారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. లివింగ్ స్టోన్ (103, 9x6, 6x4), జాసన్ రాయ్(13 బంతుల్లో 32) తప్ప ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ చెరో 3 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో మొత్తం 27 సిక్సర్లు( పాక్ 12, ఇంగ్లాండ్ 15) నమోదయ్యాయి.
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే ఇంగ్లాండ్.. క్లీన్‌స్వీప్ చేసింది.
విండీస్ సిరీస్ విజయం(Australia Vs Westindies)
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో విజయం సాధించింది వెస్టిండీస్. 16 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. వెస్టిండీస్ బౌలర్ హేడెన్ వాల్ష్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
సంక్షిప్ల స్కోర్లు:
వెస్టిండీస్-199/8 (20 ఓవర్లు), లూయిస్ (79, 9x6, 4x4), పూరన్(31). ఆండ్రూ టై 3, మిచెల్ మార్ష్ 2 వికెట్లు
ఆస్ట్రేలియా-183/9(20ఓవర్లు), ఆరోన్ ఫించ్(34), మిచెల్ మార్ష్(30). కాట్రెల్ 3, రసెల్ 3 వికెట్లు
సిరీస్ సమం (Ireland Vs South Africa)
ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. శుక్రవారం ఆఖరిదైన మూడో వన్డేలో సఫారీ జట్టు 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జానేమన్ మలన్ (177 నాటౌట్), డికాక్ (120) భారీ శతకాలతో చెలరేగారు. ఛేదనలో ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎనిమిదో స్థానంలో వచ్చిన సిమి సింగ్ (100 నాటౌట్) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశాడు.
ఇదీ చూడండి: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం