టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్(IND vs PAK t20) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev News) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి అధిగమించని నేపథ్యంలో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలవుతుందని పేర్కొన్నాడు. అయితే.. ఇరు జట్లపైనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
పాక్ టీ20 బృందం(Pakistan Squad against India 2021) దృఢంగా ఉందని.. వారికి ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యం ఉందని తెలిపాడు.
"మైదానంలో ఎవరు డామినేటింగ్‌గా ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఇరు జట్లపైనా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కానీ, దాన్ని ఎవరు అధిగమిస్తారనేదే చాలా ముఖ్యం. పాక్ టీ20 జట్టుతో చాలా ప్రమాదం. వారు ఎవరినైనా ఓడించగలరు."
-- కపిల్ దేవ్, మాజీ క్రికెటర్.
భారత జట్టు మేటి ఆటగాళ్లతో దృఢంగా ఉన్నప్పటికీ ఒత్తిడిలోనూ వారు ఎలా ఆడతారనేది చాలా ముఖ్యమని కపిల్ దేవ్ చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో తాము ఊహించని ఆటగాళ్లు వచ్చారని తెలిపాడు. ఒత్తిడిని జయించినవారికే విజయం దక్కుతుందని స్పష్టం చేశాడు.
విజయాన్ని ఊహించలేం..
పాకిస్థాన్ జట్టు ఆటతీరును ఊహించలేమని టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. అయితే.. భారత్,పాకిస్థాన్ జట్లను పోల్చలేమని, రెండింటి ఆటతీరు భిన్నంగా ఉంటుందని అన్నాడు. టీమ్ఇండియా, పాకిస్థాన్ ఇటీవలి కాలంలో ఎక్కువసార్లు తలపడలేదని, గత రికార్డులను గుర్తుచేసుకుంటూ ఉంటే సరిపోదని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: