ఒక్క మ్యాచ్ తమ జట్టు ప్రదర్శనను ప్రతిబింబించదని.. అది డబ్ల్యూటీసీ ఫైనల్(WTC final) అయినా అంతేనని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) తెలిపాడు. ఇది తనకు మరో సాధారణ మ్యాచ్‌తో సమానమని అన్నాడు.
ఐదురోజుల పాటు సాగే ఒక్క గేమ్ ఆధారంగా జట్టు ప్రదర్శనను నిర్ణయించకూడదు. ఒక్క మ్యాచ్.. గత నాలుగు-ఐదేళ్ల కృషిని ప్రతిబింబించదని ఆటను అర్థం చేసుకునేవారికి ఎవరికైనా తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా మాకు క్రికెట్ ఆగదు. మా సామర్థ్యం పట్ల నమ్మకంతో ఉంటూ.. ప్రతి అంశాన్ని సాధారణంగానే స్వీకరిస్తాము. ఇది బ్యాట్‌కి బాల్కి సంబంధించిన సమరం.
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
ఇదో పరీక్ష..
గత రెండేళ్లుగా తమ జట్టు మంచి ఫామ్‌కు ప్రతిఫలం డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుదక్కించుకోవడమని అన్నాడు కివీస్ కెప్టెన్ విలియమ్సన్. రెండేళ్ల నుంచి ఎన్నో సవాళ్లను విజ్ఞతతో ఎదుర్కొంటూ ఈ స్థానానికి టీంని తీసుకువచ్చామని పేర్కొన్నాడు.
'డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరడానికి ఎంతో శ్రమించాం. మాకు ఎంతో ఉత్కంఠగా ఉంది. కానీ చేయాల్సిన పని మీదే ధ్యాస అంత! మేమే 'ఫెవరెట్' అని అనుకోవట్లేదు. భారత్ బలమైన టీం అని భావిస్తున్నాం. రెండు జట్లు తగినంత సిద్ధం అయ్యాయి. మ్యాచ్‌లో ఏదైనా జరుగొచ్చు' అని విలయమ్సన్ అన్నాడు.
ఇదీ చదవండి:WTC: ఫైనల్లో తలపడే భారత జట్టు ఇదే