ODI World Cup 2023 Shubman Gill Vs Afghanistan : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లేని లోటు.. ప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్.. కీలకమైన లక్ష్య ఛేదనలో విఫలమయ్యాడు. అతడితో పాటు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ కూడా డకౌట్ కావడం వల్ల టీమ్ మొదట్లోనే కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది పుల్ ఫామ్‌లో ఉన్న గిల్.. డెంగ్యూ కారణంగా ఈ తొలి మ్యాచ్ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. మరి గిల్ ఇప్పుడు అప్ఘానిస్థాన్‌తో జరగబోయే రెండో మ్యాచ్‌లో అయినా ఆడతాడా అంటే అనుమానం అందరిలో నెలకొంది. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చింది.
నేడు అక్టోబర్ 9న టీమ్ ఇండియా.. తమ రెండో మ్యాచ్ జరగనున్న దిల్లీకి బయలుదేరింది. అయితే దిల్లీకి బయలు దేరిన జట్టులో గిల్ లేడు. అతడు ఇంకా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. 11వ తేదీన జరగనున్న రెండో ప్రపంచ కప్ మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు చెన్నైలోనే ఉన్నాడని, బీసీసీఐ వైద్య అధికారుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇకపోతే ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత భారత్... పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు అయినా గిల్ అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి.
నంబర్ 2 స్థానంలో గిల్.. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నంబర్-2 ర్యాంకింగ్స్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేశాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్ రికార్డును గిల్ బద్దలు కొడతాడని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడతడికి డెంగ్యూ రావడం వల్ల గిల్ ఎప్పుడు తిరిగి జట్టులోకి వస్తాడో క్లారిటీ లేకుండా పోయింది. కాగా, 2023 ప్రపంచ కప్‌లో భారత్, ఆప్ఘానిస్థాన్ మధ్య అక్టోబర్ 11వ తేదీన పోరు జరగనుంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ షురూ అవుతుంది. ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసింది. ముగ్గురు ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు బాదడం విశేషం. కాబట్టి భారత్, ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
Team India batter #ShubmanGill will not be travelling with the team to Delhi on 9th October 2023. The opening batter who missed the team’s first fixture in the ICC Men’s Cricket World Cup 2023 against Australia in Chennai is set to miss the team’s next fixture against Afghanistan… pic.twitter.com/miZnhcjl7J
— Press Trust of India (@PTI_News) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team India batter #ShubmanGill will not be travelling with the team to Delhi on 9th October 2023. The opening batter who missed the team’s first fixture in the ICC Men’s Cricket World Cup 2023 against Australia in Chennai is set to miss the team’s next fixture against Afghanistan… pic.twitter.com/miZnhcjl7J
— Press Trust of India (@PTI_News) October 9, 2023Team India batter #ShubmanGill will not be travelling with the team to Delhi on 9th October 2023. The opening batter who missed the team’s first fixture in the ICC Men’s Cricket World Cup 2023 against Australia in Chennai is set to miss the team’s next fixture against Afghanistan… pic.twitter.com/miZnhcjl7J
— Press Trust of India (@PTI_News) October 9, 2023
Virat Kohli Medal : సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్న విరాట్.. మెడల్ కొట్టేశాడుగా!