ODI World Cup 2023 Semifinal : ఆదివారం టీమ్ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ప్రపంచ కప్ 2023లో రెండు జట్ల లెక్క తేలిపోయింది. అధికారికంగా చెప్పలేదన్న మాటే కానీ.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్ఇండియా సెమీ ఫైనల్ అర్హత సాధించినట్లే. మరోవైపు, ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఐదింటిలో ఓడిన ఇంగ్లాండ్ సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉంది. అయితే నెట్ రన్ రేట్ కూడా మరీ దారుణంగా ఉంది కనుక మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ఆ జట్టుకు సెమీస్ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ జట్టు దాదాపుగా ఇంటికి వెళ్లిపోయినట్టే.
- బంగ్లాదేశ్ కూడా 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి దాదాపుగా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది.
- 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచిన సౌతాఫ్రికా కూడా సెమీస్‌కు దగ్గరగా ఉంది. దాదాపుగా అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- ఇక ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలుపులను ఖాతాలో వేసుకుని.. మెరుగైన స్థితిలో ఉన్నాయి.
- శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పాకిస్థాన్ 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలను దక్కించుకుని సెమీస్ మీద గట్టి ఆశలే పెట్టుకున్నాయి. కానీ అవి ముందుకు సాగాలంటే మిగతా మ్యాచులన్నీ గెలవాలి. అదే సమయంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పాయింట్స్ టేబుల్లో కిందకు పడిపోవాలి. అలా జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
- అఫ్గానిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, నెదర్లాండ్స్ 6 మ్యాచ్‌ల్లో 2 గెలుపులను ఖాతాలో వేసుకుని సాంకేతికంగా సెమీస్ రేసులో ఉన్నప్పటికీ.. రాబోయే మ్యాచుల్లో సంచలన విజయాలను పునరావృతం చేయడం చిన్న విషయం కాదనే చెప్పాలి.
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వంద పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది టీమ్ఇండియా. కెప్టెన్ రోహిత్.. పేసర్లు షమి, బుమ్రా జట్టు విజయంలో హీరోలుగా నిలిచారు. ఈ ప్రపంచ కప్‌లో మొదటి అయిదు మ్యాచ్‌ల్లోనూ ఛేదించి గెలిచిన టీమ్ఇండియా.. తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగి గెలిచింది. 229/9.. స్కోరు చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ind Vs Eng World Cup 2023 : షమీ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
Rohit Sharma Records List : రోహిత్ ఖాతాలో రెండు అరుదైన రికార్డులు.. ఆ ఘనత సాధించిన ఏడో కెప్టెన్‌గా..