ODI World Cup 2023 Pak VS Srilanka : వరల్డ్ కప్ - 2023లో పాకిస్థాన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మరో 10 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ మరోసారి నిరాశపరిచినా.. మహ్మద్ రిజ్వాన్ అజేయ సెంచరీతో మ్యాచ్‌ను ముగించాడు.
ఇంకా ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ( 103 బంతుల్లో 113; 10×4,3×6), మహ్మద్ రిజ్వాన్ ( 121 బంతుల్లో 134; 9×4, 3×6) సెంచరీలతో చెలరేగారు. దీంతో విజయం పాక్ సొంతమైంది. శ్రీలంక బౌలర్లలో మదుశనక 2 వికెట్లు తీయగా, తీక్షణ, పతిరణ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14×4, 6×6), సమరవిక్రమ ( 89 బంతుల్లో 108; 11×4,2×6) సెంచరీలు బాదగా, నిశాంక (61 బంతుల్లో 51; 7×4,1×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. హరీస్ రాఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆసుపత్రికి కుశాల్ మెండిస్.. కాగా, శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సెంచరీతో మెరిసిన కుశాల్ మెండీస్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతడు చేతి కండరాల నొప్పితో బాధపడ్డాడు. దీంతో స్కానింగ్ కోసం అతడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా పేర్కొంది.
ఇకపోతే... ప్రస్తుత మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్థాన్... తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియాతో ఆడనుంది. ఇప్పుడు ఓడిపోయిన శ్రీలంక తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 16న లఖ్‌నవూలో ఆస్ట్రేలియాతో ఆడనుంది.
-
🚨RECORDS-TUMBLING NIGHT IN HYDERABAD
— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Highest successful chase in a @cricketworldcup match ✅
Highest successful run-chase for 🇵🇰 in an away game ✅#PAKvSL | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/5GIcUAdXNx
">🚨RECORDS-TUMBLING NIGHT IN HYDERABAD
— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2023
Highest successful chase in a @cricketworldcup match ✅
Highest successful run-chase for 🇵🇰 in an away game ✅#PAKvSL | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/5GIcUAdXNx🚨RECORDS-TUMBLING NIGHT IN HYDERABAD
— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2023
Highest successful chase in a @cricketworldcup match ✅
Highest successful run-chase for 🇵🇰 in an away game ✅#PAKvSL | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/5GIcUAdXNx
ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్‌పై ఫాసెస్ట్ సెంచరీ