ETV Bharat / sports

ODI World Cup 2023 AFG vs IND : అప్గాన్​ బ్యాటింగ్ పూర్తి.. బుమ్రా 4 వికెట్లు.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం - హస్మతుల్లా షాహిది టీమ్ ఇండియా మ్యాచ్​

ODI World Cup 2023 AFG vs IND : వరల్డ్ కప్​లో భాగంగా నేడు(సెప్టెంబర్ 11) జరుగుతున్న మ్యాచ్​లో అప్గానిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్​ ఇండియా లక్ష్యం ఎంతంటే?

ODI World Cup 2023 AFG vs IND : బుమ్రా టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 6:08 PM IST

Updated : Oct 11, 2023, 6:41 PM IST

ODI World Cup 2023 AFG vs IND : వరల్డ్ కప్​లో భాగంగా టీమ్​ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్​లో అప్గానిస్తాన్​ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (21), ఇబ్రహీం జాద్రాన్‌ (22), రహమత్ షా (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (62; 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును కాస్త ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా వారు నామమాత్రపు పరుగులు చేశారు. మహ్మద్‌ నబీ (19), రషీద్‌ఖాన్‌ (16), ముజీబుర్‌ రెహ్మన్‌ (10*), నవీనుల్ హక్‌ (9*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్య 2, శార్దూల్ ఠాకూర్​, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో వైడ్ రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ఇబ్రహీం.. బుమ్రా బౌలింగ్‌లో కేఎల్​ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు.

28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 21 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసిన రెహ్మాత్ షా కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

దీంతో 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది అప్గానిస్థాన్​. ఆ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ఆప్గాన్​ కెప్టెన్ హష్మతుల్లా షాహిది కలిసి నాలుగో వికెట్‌కు 128 బంతుల్లో 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ను హార్దిక్​ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు..

ఇక 88 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 80 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీని కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయగా.. 8 బంతుల్లో 2 పరుగులు చేసిన నజీబుల్లా జాద్రాన్, బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు. 27 బంతుల్లో ఓ ఫోర్‌ సాయంతో 19 పరుగులు చేసిన మహ్మద్ నబీ, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఈ క్రమంలోనే 235 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఆప్గానిస్తాన్​.. రషీద్ ఖాన్ 12 బంతుల్లో బాదిన ఓ ఫోర్, ఓ సిక్సర్‌ సాయంతో 16 పరుగులు చేసి కాస్త ముందుకు వెళ్లింది. ఇక ముజీబ్ వుర్ రెహ్మాన్ 2 ఫోర్లతో 10 పరుగులు చేయగా నవీన్ ఉల్ హక్ ఓ ఫోర్ బాది 9 పరుగులు చేశాడు.

ICC Latest ODI Rankings Kohli : అదరగొట్టిన కోహ్లీ - కేెఎల్ రాహుల్​.. ఏకంగా..

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

Last Updated : Oct 11, 2023, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.