NZ VS SA first test: న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. సఫారీ జట్టు ఇన్నింగ్స్ 276 పరుగులు తేడాతో ఓడిపోయింది. కివీస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లను దక్కించుకున్నాడు. ఈ విజయంతో రెండు మ్యాచుల సిరీస్‌లో 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది కివీస్ జట్టు.
387 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాను 111 రన్స్‌కే కట్టడి చేశారు న్యూజిలాండ్ బౌలర్లు. టిమ్ సౌథీ 5, మ్యాట్ హెన్లీ 2, నీల్ వ్యాగ్నర్ 2, కైల్ జెమీసన్ ఓ వికెట్ తీశారు. సఫారీ జట్టు బ్యాటర్లలో టెంబా బవుమా 41 హైస్కోరు. మిగతా వారు విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై 95 పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌లోనూ తేలిపోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 482 భారీ పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 105 సెంచరీతో మెరవగా, టామ్ బ్లండర్(96), మ్యాట్ హెన్రీ(58), వాంగ్నర్(49), డి గ్రామ్హోమ్(45) మెరుగ్గా రాణించారు. సఫారీ బౌలర్లలో ఒలివియర్ 3, మరక్రమ్, రబాడా, మార్కో జాన్సన్ తలో రెండు వికెట్లు తీయగా గ్లెంటన్ స్టుర్మన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, రెండో టెస్టు ఫిబ్రవరి 25నుంచి ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియాదే సిరీస్.. రెండో టీ20లో విండీస్‌పై విజయం