ETV Bharat / sports

టెస్టు క్రికెట్​లో అరుదైన ఘనత.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్ - ఇండియా vs న్యూజిలాండ్ కేన్​ విలియమ్సన్

టెస్టు క్రికెట్​లో న్యూజిలాండ్​ అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-1 డ్రా చేసుకుంది న్యూజిలాండ్​.

New Zealand beat England by one run
New Zealand beat England by one run
author img

By

Published : Feb 28, 2023, 9:54 AM IST

Updated : Feb 28, 2023, 10:32 AM IST

టెస్టు క్రికెట్​లో అరుదైన ఘనత నమోదైంది. ఇంగ్లాండ్​పై న్యూజిలాండ్​ కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 256 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్​ గెలుస్తుందన్న ఈ మ్యాచ్​ అనూహ్యంగా మలుపు తిరిగి కివీస్​కు సంచలన విజయాన్ని కట్టబెట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-1 సమం చేసుకుంది న్యూజిలాండ్​.

ఇంగ్లాండ్​ బ్యాటర్ జో రూట్​(95) అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు ఉన్నంత వరకు ఇంగ్లాడ్​ సునాయసంగా గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ విజయానికి 56 పరుగుల దూరంలో టెయిల్​ ఎండర్లకు ఛేజింగ్​ అప్పడిగించాడు రూట్​. కానీ, కివీస్​ బౌలర్లు రెచ్చిపోవడం వల్ల మ్యాచ్​ మలుపు తిరిగింది. విజయానికి ఒక పరుగు దూరంలో.. వాగ్నర్​ బౌలింగ్​లో జేమ్స్​ ఆండర్సన్​ ఆడిన బంతిని టామ్​ బ్లండెల్ క్యాచ్​ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్​ కథ ముగిసింది. ​కివీస్​ బౌలర్లలో నీల్​ వాగ్నర్(4) వికెట్లతో రెచ్చిపోగా.. టిమ్​ సౌథీ(3), హెన్రీ(2) వికెట్లు తీసి రాణించారు.

అరుదైన ఘనత..
146 ఏళ్ల టెస్టు క్రికెట్​ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం ఇది నాలుగోసారి. ఇదే కాకుండా ఫాలో ఆన్​ ఆడిన తర్వాత విజయం సాధించిన మూడో దేశంగా న్యూజిలాండ్​ అవతరరించింది. ఇప్పటివరకు ఫాలో ఆన్​ ఆడి గెలిచింది భారత్​, ఇంగ్లండ్​ మాత్రమే.

టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో​ 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చేసింది. దీంతో బ్యాటింగ్​కు దిగిన కివీస్​ తొలి ఇన్నింగ్స్​లో 209 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం న్యూజిలాండ్​ రెండో ఇన్నింగ్స్‌ ఫాలో ఆన్‌ ఆడింది. ఈ ఇన్నింగ్స్​లో కివీస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. విలియ‌మ్స‌న్‌తో పాటు వికెట్ కీప‌ర్ బ్లండెల్(90) రాణించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇక ఈ ఇన్నింగ్స్​లో విలియమ్సన్(132) పరుగులతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత 258 పరుగుల తేడాతో బరిలోకి దిగిన ఇంగ్లండ్​ 256 పరుగులకే ఆల్​ఔట్​ అయింది.

Last Updated : Feb 28, 2023, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.