NZ vs AFG World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 289 పరుగుల టార్గెన్‌ను ఛేదించలేక అఫ్గాన్.. 34.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలింగ్ ధాటికి ఆరుగురు అఫ్గాన్ ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3, ఫెర్గ్యూసన్ 3, బోల్ట్ 2, హెన్రీ, రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు. అద్భుత హాఫ్ సెంచరీతో రాణించిన కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (71 పరుగులు)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో కివీస్ 8 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది.
కివీస్ ఇన్నింగ్స్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. మొదట్లో వేగంగా ఆడే క్రమంలో డేవన్ కాన్వే (20) వికెట్ పారేసుకున్నాడు. 6.3 ఓవర్ల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత మరో ఓపెనర్ విల్ యంగ్ (54), వన్ డౌన్లో వచ్చిన రాచిన్ రవీంద్ర (32)తో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. కానీ, వీరిద్దరి జోడీని 20.2 వద్ద అజ్మతుల్లా విడగొట్టాడు. అదే ఓవర్లో యంగ్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో డారిల్ మిచెల్ (1) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దీంతో 110 పరుగుకు 4 వికెట్లు కోల్పోయింది కివీస్..
ఆదుకున్న ఆ ఇద్దరు.. లాథమ్, ఫిలిప్స్ కలిసి 5 వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు. వీరిద్దరూ అఫ్గాన్ బౌలర్లకు మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే టామ్ లాథమ్ (68 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (71 పరుగులు) ఆర్థ శతకాలు పూర్తి చేశారు. ఇక చివర్లో వీరిద్దరినీ నవీనుల్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆఖర్లో చాప్మన్ (25 పరుగులు, 12 బంతుల్లో) జోరుతో కివీస్ స్కోర్ 280 దాటింది. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్‌జాయ్ 2, నవీనుల్ హక్ 2, ముజిబుర్ రెహ్మన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అఫ్గాన్ ఆరంభం నుంచే.. 289 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. మొదట్నుంచే తడబడింది. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహ్మత్ షా (36), ఒమర్జాయ్ (27) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, వీరి జోడి 97 పరుగుల వద్ద విడిపోయింది. తర్వాత 30.3 ఓవర్లకు 125/5తో నిలిచి పోరాడుతుందనిపించింది. కానీ, ఆ తర్వాత మరో 25 బంతుల్లో 14 పరుగులు జోడించిన అఫ్గాన్.. చివరి 5 వికెట్లు పారేసుకుంది.
-
New Zealand continue their unbeaten run in #CWC23 with yet another emphatic win in Chennai 👊#NZvAFG 📝: https://t.co/R2WCgfr1UR pic.twitter.com/GTsrXdBYh3
— ICC (@ICC) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">New Zealand continue their unbeaten run in #CWC23 with yet another emphatic win in Chennai 👊#NZvAFG 📝: https://t.co/R2WCgfr1UR pic.twitter.com/GTsrXdBYh3
— ICC (@ICC) October 18, 2023New Zealand continue their unbeaten run in #CWC23 with yet another emphatic win in Chennai 👊#NZvAFG 📝: https://t.co/R2WCgfr1UR pic.twitter.com/GTsrXdBYh3
— ICC (@ICC) October 18, 2023
ODI World Cup 2023 : ప్రపంచకప్‌లో సంచలనాలు.. మొన్న అఫ్గాన్, నిన్న 'డచ్'.. వీరితో జాగ్రత్త బాసూ!
ODI WorldCup 2023 AFG VS ENG : జగజ్జేత ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్గానిస్థాన్.. ప్రపంచకప్‌లో సంచలనం