IND vs NZ 1st Test: 280 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు ఆటలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతోంది. లంచ్ విరామానికి 79/1 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్(35), విలియమ్ సోమర్విల్లే(36) క్రీజులో ఉన్నారు.
నాలుగో రోజు ఆట సాగిందిలా..
తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమ్‌ఇండియా.. ఆఖర్లో కివీస్ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. న్యూజిలాండ్ గెలవాంటే ఒక్క రోజు (90 ఓవర్లు)లో 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్కు విజయం దక్కాలంటే తొమ్మిది వికెట్లు పడగొట్టాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్ 283 పరుగులకు చేరింది.
ఇదీ చదవండి:
Shreyas iyer on Rahul Dravid: 'రాహుల్ సర్ నాకు చెప్పింది అదే..'