ETV Bharat / sports

క్రికెట్​లోనే కాదు.. టెన్నిస్​లోనూ అదరగొడుతున్న ధోనీ.. స్టేడియం హౌస్​ఫుల్​! - ధోనీ టెన్నిస్​ గేమ్​

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ.. టెన్నిస్​లో​ తన సత్తా చాటుతున్నాడు. ఝార్ఖండ్​లో జరుగుతున్న ఓ టోర్నీలో ధోనీ జోడీ ఫైనల్​కు చేరుకుంది.

Dhoni Tennis
Dhoni Tennis
author img

By

Published : Nov 10, 2022, 8:22 PM IST

Dhoni Tennis: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ పేరు వినని వారుండరు. క్రికెట్​లో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న అతడు.. ఇప్పుడు టెన్నిస్ కోర్టులోనూ తన సత్తా చాటుతున్నాడు. రాంచీలోని జేఎస్​సీఏ(ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్) నిర్వహిస్తున్న టెన్నిస్ టోర్నమెంట్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ డబుల్స్ కేటగిరీలో ధోనీ ద్వయం ఫైనల్‌కు చేరుకుంది.

టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ధోనీ-సుమిత్ బజాజ్ జోడీ.. 6-0, 6-0తో రాజేష్, శశి జోడీపై విజయం సాధించింది. దీంతో ఫైనల్​లో అడుగుపెట్టింది. ఫైనల్లో ధోనీ ద్వయం వినీత్-కైఫ్ ద్వయంతో తలపడనుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్​ మ్యాచ్‌లో కూడా ధోనీ-సుమిత్ ద్వయం 9-0, 9-0 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. టెన్నిస్ ఆడుతున్న ధోనీని చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తున్నారు. కాగా, మిస్టర్​ కూల్​ సమయం దొరికినప్పుడల్లా ఫుట్‌బాల్, టెన్నిస్‌తో సహా అనేక ఇతర క్రీడలను ఉత్సాహంగా ఆడుతుంటాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.