ETV Bharat / sports

'బాన్​క్రాఫ్ట్ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపించలేదు' - క్రికెట్ ఆస్ట్రేలియా

సాండ్ పేపర్​ వివాదంపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. బాన్​క్రాఫ్ట్ వ్యాఖ్యల పట్ల పలు పత్రికలు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ తనకలా అనిపించలేదని పేర్కొన్నాడు.

michael clarke, former australia captain
మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ కెప్టెన్
author img

By

Published : May 17, 2021, 5:29 PM IST

Updated : May 17, 2021, 5:38 PM IST

2018లో కేప్​టౌన్ టెస్టులో జరిగిన సాండ్​ పేపర్​ గేట్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. ఈ విషయం గురించి మరికొందరికి తెలుసంటూ ఆసీస్ క్రికెటర్ బాన్​క్రాఫ్ట్​ చేసిన వ్యాఖ్యలు తనకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదని పేర్కొన్నాడు.

"సాండ్​ పేపర్​ గేట్ వివాదంలో.. మైదానంలో ఏమి జరిగిందో క్రికెట్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి తప్పుగా మాట్లాడటానికి ఏమి లేదు. బాల్​ ట్యాంపరింగ్​ విషయం కేవలం వార్నర్, స్మిత్, బాన్​క్రాఫ్ట్​లకు మాత్రమే తెలుసంటే నమ్మశక్యంగా లేదు. బాన్​క్రాఫ్ట్​ మాట్లాడిన మాటలు తమకు ఆశ్చర్యంగా అనిపించాయని చాలా పేపర్లు ఆర్టికల్స్​ రాశాయి. కానీ నాకేమీ అలా అనిపించలేదు."

-మైకేల్ క్లార్క్​, ఆసీస్ మాజీ కెప్టెన్.

గతంలో జరిగిన వివాదం గురించి బాన్​క్రాఫ్ట్​ ఇప్పుడు మాట్లాడడం తప్పు కాదని క్లార్క్ పేర్కొన్నాడు. కానీ, అతడు కొత్తగా చెప్పిన విషయమేమీ లేదని తెలిపాడు.

ఇదీ చదవండి: 'మా వాళ్లను క్షేమంగా పంపారు.. థ్యాంక్యూ బీసీసీఐ'

బాన్​క్రాఫ్ట్​ను కలిసిన సమగ్రత యూనిట్​..

బాల్​ ట్యాంపరింగ్ వివాదంపై తాజాగా నోరు విప్పిన బాన్​క్రాఫ్ట్​ను క్రికెట్ ఆస్ట్రేలియా సమగ్రత యూనిట్​ కలిసింది. కొత్తగా ఏమైనా సమాచారం వెల్లడిస్తాడేమోనని ప్రయత్నించింది. బాన్​క్రాఫ్ట్​ స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. ఎవరికైనా ఈ అంశంపై సమాచారం ఉంటే తెలియజేయాలని కోరింది.

సమగ్ర దర్యాప్తు చేయండి..

గతంలో ఈ అంశంపై సరైన దర్యాప్తు చేయలేదని.. అందుకే ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చిందని ఆసీస్ మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్​ అభిప్రాయపడ్డాడు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోరాడు.

ఇదీ చదవండి: తిరగబెట్టిన గాయం.. కివీస్​తో సిరీస్​కు ఆర్చర్​ దూరం

Last Updated : May 17, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.