ETV Bharat / sports

భారత ఆటగాళ్లకు హలాల్ మాంసం.. చిక్కుల్లో బీసీసీఐ!

భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్​ గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేకమైన ఫుడ్ మెనూను రూపొందించింది బీసీసీఐ. అయితే ఈ మెనూలో హలాల్ మాంసానికి(halal meat india cricket) ప్రాధాన్యమివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

BCCI
BCCI
author img

By

Published : Nov 23, 2021, 7:55 PM IST

Updated : Nov 23, 2021, 9:18 PM IST

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల కోసం ప్రత్యేకమైన డైట్ ప్లాన్​ను రెడీ చేసింది బీసీసీఐ. అయితే ఇదికాస్తా బోర్డును చిక్కుల్లో పడేసింది. న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్​లో.. వారందరూ హలాల్ సర్టిఫైడ్ మాంసాన్ని(halal meat india cricket) మాత్రమే తీసుకోవాలని చెప్పడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో బీసీసీఐ విధానాన్ని తప్పుపడుతూ 'BCCI Promotes Halal'ను ట్విట్టర్​లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఓ స్పోర్ట్స్​ వెబ్​సైట్ ప్రకారం భారత ఆటగాళ్ల కోసం రూపొందించిన డైట్ మెనూలో హలాల్ మాంసం మాత్రమే ఉండాలని బోర్డు పేర్కొంది. వారి ఆహారంలో ఈ మాంసం తప్ప బీఫ్, ఫోర్క్​లాంటివి అసలు ఉండరాదని స్పష్టం చేసింది.

Bcci Halal Meat Controversy: హలాల్ మాంసానికి ప్రాధాన్యం ఇవ్వడంపై బీసీసీఐని విమర్శిస్తున్నారు నెటిజన్లు. హిందువులు, సిక్కులు ఈ మాంసానికి దూరంగా ఉంటారని.. అలాంటపుడు ఆటగాళ్ల కోసం హలాల్ మాంసాన్ని ఎలా అందిస్తారంటూ మండిపడుతున్నారు. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కేవలం ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడని.. అయినా అందరికీ హలాల్ మాంసాన్ని అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

  • #BCCI_PROMOTES_HALAL @BCCI Please explain, why Halal food to cricketers? It's okay that you are not feeding them beef or pork. But why Halal? And why not Jhatka meat?

    — J33v@nmukta (@J33vPawan) November 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

న్యూజిలాండ్ డైట్ ఇదే

పరిమిత మోతాదులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్​, చాలా తక్కువగా కొవ్వుతో కూడిన ఆహారాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కోసం తయారు చేయిస్తున్నారు. అలాగే రెడ్ మీట్, వైట్ మీట్​ కూడా వీరి మెనూలో ఉంది.

ఇవీ చూడండి: రహానెకు అండగా పుజారా.. ఒక్క ఇన్నింగ్స్ చాలంటూ!

Last Updated : Nov 23, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.