Nicholas Pooran Fine : వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు ఐసీసీ షాకిచ్చింది. భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో నికోలస్ పూరన్.. అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించాడనే అభియోగాలతో అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో నికోలస్‌కు భారీ జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది.
మరోవైపు అంపైర్ల ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ.. నికోలస్ ఐసీసీ నిబంధనల్లోనీ లెవెల్ 1 తప్పిదం చేశాడని గుర్తించి అతనిపై చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు నిబంధనల ప్రకారం ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు. ఇక మ్యాచ్ రిఫరీ ముందు నికోలస్ తన తప్పిదాన్ని అంగీకరించడం వల్ల ఇక ఈ విషయంపై తదుపరి విచారణ లేకుండానే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఐసీసీ తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ప్లేయర్ ఏడాది కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందాడంటే.. ఇక అతను రెండు వైట్‌బాల్ గేమ్స్‌తో పాటు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.
' ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 2.7ను నికోలస్ పూరన్ ఉల్లంఘించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగా విమర్శించడం లెవెల్ 1 నేరం. పూరన్ తన తప్పిదాన్ని అంగీకరించడం వల్ల ఈ విషయంలో తదుపరి విచారణ అనవసరం. అందుకే నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్.. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు.'అంటూ ఐసీసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
అసలేం జరిగింది..
వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన పూరన్ రివ్యూ తీసుకొని.. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా ఔటివ్వడం వల్ల పూరన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అంపైర్‌ను దూషించాడు. దీంతో మ్యాచ్ తర్వాత పూరన్‌పై అంపైర్లు మ్యాచ్ రిఫరికీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సరైన విచారణ చేపట్టిన రిఫరీ పూరన్‌పై చర్యలు తీసుకున్నాడు.
Ind vs Wi T20 : చెలరేగిన పూరన్.. రెండో టీ20లోనూ భారత్‌పై విండీస్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌గా న్యూయార్క్ MI.. పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. కానీ ఏం లాభం!