Next Test Captain: విరాట్ కోహ్లీ వారసత్వాన్ని రిషభ్ పంత్ కొనసాగించాలని అన్నాడు లెజెండరీ క్రికటర్ సునీల్ గావస్కర్. వికెట్ కీపర్ పంత్‌ను తదపరి టెస్టు కెప్టెన్ చేయాలని అన్నాడు. ఆ బాధ్యత అతడిని అన్ని ఫార్మాట్లలో ఉత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దుతుందని చెప్పాడు.
"భారత క్రికెట్‌ను ఇక నుంచి ముందుకు తీసుకెళ్లేది ఎవరనేదానిపై సెలక్షన్ కమిటీలో తీవ్రమైన జరగుతుంది. అయితే అది.. అన్ని ఫార్మాట్లలో ఆటోమెటిక్‌గా ఎంపిక చేసుకోగలిగే వ్యక్తి అయ్యుండాలి. నా వరకు టీమ్ఇండియా తదుపరి కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఉండాలి. అందుకు ఒకటే కారణం ఉంది. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ బ్యాటింగ్‌లో ఎలాగైతే మార్పు వచ్చిందో.. అలానే కెప్టెన్ బాధ్యత పంత్‌ను మరింత నాణ్యమైన బ్యాటర్‌గా మారుస్తుంది."
- సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు విరాట్. దీంతో సారథిగా విజయవంతంగా కొనసాగిన అతడి ఏడేళ్ల ప్రస్థానానికి తెరపడింది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఆ సామర్థ్యం అతడిలో ఉంది..
దక్షిణాఫ్రికాలో చేసిన శతకాల్లాంటివి మరెన్నో సాధించడానికి కెప్టెన్సీ బాధ్యత పంత్‌కు దోహదం చేస్తుందని గావస్కర్ అన్నాడు. "నారి కాంట్రాక్టర్ గాయపడిన తర్వాత జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. టైగర్ పటౌడీ 21 ఏళ్లకే కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ సారథిగా పంత్ సామర్థ్యం ఏంటో మనం చూశాం. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం అతడికి ఉందని నమ్ముతున్నా. జట్టును అతడు ఆసక్తికరంగా మారుస్తాడు." అని గావస్కర్ అన్నాడు.
విరాట్ అనంతరం వన్డే సారథి రోహిత్ శర్మ.. టెస్టు కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. అజింక్య రహానె స్థానంలో టెస్టు వైస్ కెప్టెన్‌గా ఇటీవలే ఎంపికయ్యాడు హిట్‌మ్యాన్. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో కోహ్లీ డెప్యూటీగా కేఎల్ రాహుల్ ఉన్నాడు.
ఇవీ చూడండి:
Virat Kohli Test Captaincy: సారథి.. సరిలేరు నీకెవ్వరూ!