భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను నెగ్గి ఊపుమీదున్న ఆతిథ్య జట్టు.. టెస్టు మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 144/4 తో నాలుగోరోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 1.4 ఓవర్లలో ఇంకా ఒకరోజు ఉండేగానే మ్యాచ్‌ను ముగించింది.
స్కోర్ బోర్డు..
- భారత్ తొలి ఇన్నింగ్స్: 165ఆలౌట్
- భారత్ రెండో ఇన్నింగ్: 191 ఆలౌట్
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్: 348 ఆలౌట్
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 9 పరుగులు(వికెట్ నష్టపోకుండా)
ఇదీ చూడండి:అసలైన టెస్టు ఇప్పుడే మొదలైంది: అశ్విన్