ETV Bharat / sports

మూడో వన్డేలోనూ టీమ్ఇండియాదే విజయం.. న్యూజిలాండ్​తో సిరీస్​ క్లీన్​స్వీప్​ - న్యూజిలాండ్​తో సిరీస్​ క్లీన్​స్వీప్​

న్యూజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్​ స్వీప్​ చేసింది.

new zealand tour of india 2023
new zealand tour of india 2023
author img

By

Published : Jan 24, 2023, 9:02 PM IST

Updated : Jan 24, 2023, 9:11 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101), శుభ్‌మన్‌ గిల్ (112) శతకాలకు తోడు హార్దిక్‌ పాండ్య (54) అర్ధ శతకంతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (36) ఫర్వాలేదనిపించగా.. ఇషాన్‌ కిషన్‌ (17), సూర్యకుమార్‌ యాదవ్‌ (14), వాషింగ్టన్‌ సుందర్‌ (9) నిరాశపర్చారు. కివీస్ బౌలర్లలో జాకబ్, టిక్నర్‌ చెరో మూడు‌ వికెట్లు పడగొట్టగా.. మైఖేల్‌ బ్రాస్‌వెల్ ఒక వికెట్ తీశాడు.

Last Updated : Jan 24, 2023, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.